వైరల్: వీడు నావాడు అంటే నావాడు అంటున్న అమ్మాయిలు..!

సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవపడడం మనం చూసుంటాం.కానీ అందుకు భిన్నంగా ఓ యువకుడి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవపడ్డారు.

 Girls Street Fight For Boyfriend In Chennai Details, Viral Latest, News Viral,-TeluguStop.com

నడిరోడ్డు పైనే అన్నీమరిచి తన్నుకున్నారు.నడి రోడ్డు మీదే బాహాబాహీకి దిగడంతో వారిని వారించడానికి అక్కడివారు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

విచిత్రమైన ఇలాంటి విచిత్రమైన సంఘటనలను మామూలుగా అయితే.మనం సినిమాల్లో చూస్తుంటాం.

అలాంటి ఓ సంఘటన తమిళనాడులోని చెన్నై లో నగరం నడిబొడ్డున ఈ ఘటన చోటుచేసుకుంది.

ఒకే అబ్బాయిని.

ఇద్దరు అమ్మాయిలు గాఢంగా ప్రేమించారు.ఈ విషయం వారిరువురికి తెలియడానికి కాస్త సమయం పట్టింది.

ఆ పాటికే వారు ఆ అబ్బాయితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు.దీంతో అతన్ని నేను ప్రేమిస్తున్నానంటే.నేను ప్రేమిస్తున్నాను.అతను నావాడు అంటే.కాదు నావాడంటూ వాదనకు దిగారు.అది కాస్త ముదిరి ఏకంగా రోడ్డు మీదే తన్నుకునే వరకూ వచ్చింది.

అందరూ చూస్తున్నారనే సంగతి కూడా మర్చిపోయి ఒకరినొకరూ జుట్టు పట్టుకుని.పిడిగుద్దులు గుద్దుకున్నారు.

వారిరువురూ గొడవ పడుతుండగా.పక్కనున్న విద్యార్థులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

ఇప్పుడు అది కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

Telugu Boyfriend, Chennai, Lover, Street, Tamil Nadu, Latest-Latest News - Telug

ఓ అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు గొడవ పడడం భలేగా ఉందే అంటూ కొందరు కామెంట్ పెడుతుండగా.అమ్మాయికి ఇలా రోడ్డు మీద తన్నుకోవడం ఏంటంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.తల్లిదండ్రులు కష్టపడి పెంచి పోషించి చదివిస్తే కాలేజీలకు వెళ్లి ప్రేమ పాటలు తప్ప చదువుకోవడం లేదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్నేహితులు అంతా చూస్తుండగానే ఇద్దరు అమ్మాయిలు కొట్టుకోవడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube