తెలంగాణా లో మరోసారి ఎన్నికల నగారా మోగింది.మొన్న జరిగిన దుబ్బాక బై ఎలక్షన్స్ తరువాత అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ సర్కార్ కు గుబులు మొదలైంది.
కేసీఆర్ ఇలాఖా లోనే ఓటమి చూడడం తో ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమై ఈ గ్రేటర్ ఎన్నికలను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోనుంది.దుబ్బాక ఎన్నికల ఫలితాల తరువాత జరగనున్న ఎన్నికలు కావడం తో ఇప్పుడు అందరి దృష్టి ఈ ఎన్నికల పైనే పడింది.
జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి ప్రకటించారు.ప్రెస్ మీట్ ద్వారా ఆయన వివరాలను వెల్లడిస్తూ….
గత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఈ సారి ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు ప్రకటించారు.ఇప్పటికే ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.
ఎన్నికల కమిషన్ ఈరోజు షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది.రేపటి నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ, ఆ తరువాత ఈ నెల 21న నామినేషన్ల పరిశీలన, 22 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల విత్ డ్రా వంటి వాటికి అవకాశం ఉంటుంది అని ఆయన వెల్లడించారు.
అలానే ఈ ఎన్నికలు డిసెంబర్ 1 న నిర్వహించనుండగా ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.అలానే బ్యాలెట్ పద్దతిలోనే ఎన్నికల ప్రక్రియ ఉండనున్నట్లు స్పష్టం చేశారు.
డిసెంబర్ 4న కౌంటింగ్, ఫలితాలు వెలువడతాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి స్పష్టం చేశారు.అలానే ఈ సారి మేయర్ పదవి మహిళ కు రిజర్వ్ చేసినట్లు ఎన్నికల కమీషనర్ తెలిపారు.
మరోపక్క ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు కూడా సన్నద్దమౌతున్నాయి.ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఇంచార్జ్ లను నియమించి గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టేశాయి.

ఇక ఇప్పుడు ఎన్నికల కమీషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో ఇక పార్టీలు అన్ని కూడా ఒక్కొక్కటిగా రంగంలోకి దిగనున్నాయి.ఇటీవల దుబ్బాక బై ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ విజయాన్ని అందుకోవడం తో టీఆర్ఎస్ పార్టీ లో ఒక రకమైన టెన్షన్ మొదలైంది.అందుకే ఈ గ్రేటర్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చూస్తుంది.మరి ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అనేది తెలియాలి అంటే కొద్దీ రోజులు ఆగాల్సిందే.