మనం నిత్యం ఎన్నో రకాల వీడియోలను సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం.అయితే ఇందులో రోడ్డు యాక్సడెంట్లకు సంబంధించిన వీడియోలు ఎంతలా పాపులర్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
నిజానికి రోడ్డు ప్రమాదం అంటే ఒక వ్యక్తకి గాయాలు కావడం కాదు.ఒక కుటుంబం రోడ్డున పడిపోవడం అనే చెప్పుకోవాలి.
కాగా కొన్ని సార్లు నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరిగితే.మరికొన్ని సార్లు అనుకోకుండా చేసిన పనుల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
కాగా ఇలాంటి ప్రమాదాల్లో కొందరు ఎలాంటి గాయాలు కాకుండా బయట పడుతున్నారు కూడా.
ఇప్పుడు కూడా ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఓ ప్రమాదం జరిగింది.
దాన్ని చూసిన వారంతా కూడా షాక్ అయిపోతున్నారు.ఇలాంటి ప్రమాదం ఎలా చేస్తారంటూ ఆ డ్రైవర్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరి ఆ వీడియోకు సంబంధించిన వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ వీడియోలో డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ అమ్మాయి మీద నుంచి కారు ఎక్కింది.
అయితే అదృష్ట వశాత్తు ఆమెకు ఎలాటి గాయాలు కాలేవని తెలుస్తోంది.రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ టాటర్స్థాన్లోని జెలెనోడోల్స్క్ సిటీలో ఈ ఘటన జరిగినట్టు మనకు తెలుస్తోంది.
ఇందులో చూస్తుంటే.మంచు ప్రాంతంలో ఓ 77 ఏళ్ల మహిళ కారు వెనకాల నిలబడి ఉంది.అయితే విపరీతంగా కురుస్తున్న మంచు వల్ల ఆమెను గుర్తించలేదు డ్రైవర్.కారులో ఉన్న డ్రైవర్ అనుకోకుండా రివర్స్ గేర్ వేయడంతో ఆమెను కారు ఢీ కొట్టింది.అంతే కాకుండా మరోసారి వెనక్కు రావడంతో ఆమె మీదకు కారు ఎక్కినట్టు కనిపిస్తోంది.దాంతో ఆమె అక్కడికక్కడే కుప్ప కూలిపోయింది.
ఇంత జరిగినా సరే అతను వెనకాల ఏం జరుగుతుందో మాత్రం గమనించలేదు.అంతా అయిపోయిక వచ్చి ఆమెను చూసి పైకి లేపాడు.
అయితే ఆమెకు పెద్దగా గాయాలు కాలేదు.పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.