ఇదేంటి విడ్డురం అని ముక్కుమీద వేలు వేసుకోమాకండి.ఇది నిజంగానే జరిగింది.
క్రికెట్ బాల్ కోసం ఓ గ్రామంలోని రెండు వర్గాల మధ్య భీకర యుద్ధమే జరిగింది.అవును.
ఇక్కడ విలన్ ఎవరు తెలిస్తే నవ్వుకుంటారు.కేవలం ఓ క్రికెట్ బాల్ ఆ గ్రామంలోని ఇరు వర్గాల మధ్య చిచ్చు రేపింది.
సదరు బాల్‌ను కొన్నందుకు ఎవరు డబ్బులు ఇవ్వాలి.? అనే అంశం కాస్త వివాదంలా మారి చిలికిచిలికి గాలి వానలా మారి ఏకంగా రోడ్డు పైనే జుట్టులు పట్టుకుని కొట్టుకునే స్థాయి వరకు వచ్చిందంటే నమ్మశక్యం కాదు.
ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళితే., కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి జిల్లా తాలూకాలోని జరిగిన ఈ బంతి యుద్ధంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు.
కథ అక్కడితో ముగిసిపోకుండా కొందరు యువకులు కర్రలు తీసుకొని ఇష్టం వచ్చినట్లు పరస్పరం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.ఈ ఘటనలో ఏకంగా ఏడుగురికి తీవ్ర గాయాలవ్వడం కొసమెరుపు.
మరికొందరు స్పల్పంగా గాయపడి బయటపడిపోయారు.
కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి తాలూకాలోని గొబ్బోరా అనే గ్రామంలో దాదాపు 5 రోజుల క్రితం క్రికెట్ టోర్నమెంట్ ఒకటి జరిగింది. టోర్నమెంట్ జరుగుతుండగా ఓ బాల్ పగిలిపోయింది.దాంతో అక్కడ వున్న ఇరు జట్లు కూడా కొనాల్సిన క్రికెట్ బాల్‌కు డబ్బులు ఎవరు కట్టాలి.? అనే దానిపై వివాదం చెలరేగింది.అది కాస్తా గొడవగా మారి చివరకు కర్రలతో దాడి చేసుకునే స్థాయికి చేరింది.
కాగా ఈ వివాదంలో భాగంగా గ్రామంలోని మహిళలు, యువకులు, పెద్దవాళ్లు అందరూ రోడ్డు పైకి వచ్చి ఇష్టసారంగా కొట్టుకోవడం బాధాకరం.