సమంతకు డబుల్ అవార్డ్స్.. ఆ ఒక్క సిరీస్ తో ఊహించని స్థాయికి?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకులు ప్రకటన తర్వాత ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందుకుంటున్నారు.ఈ క్రమంలోనే విడాకుల విషయం నుంచి బయట పడటం కోసం సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే కాకుండా తన స్నేహితులతో కలిసి విదేశీ పర్యటనలు చేస్తున్నారు.

 Samantha Ruth Prabhu, Tollywood, Film Industry, Double Awards, Series,latest New-TeluguStop.com

ఇకపోతే ఈ నెలలో గోవాలో జరిగే ఐఫా వేడుకలలో భాగంగా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించే అవకాశాన్ని సమంత దక్కించుకున్నారు.

ఈ క్రమంలోనే సమంత మరొక అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకుంది.

ఎఫ్‌సి డిస్రప్టర్స్-2021 జాబితాను విడుదల చేయగా ఆ జాబితాలో సమంత ఎనిమిదవ స్థానంలో నిలిచింది.ఈ క్రమంలోనే సమంత ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ఎంతోమంది అభిమానులు ఆమె సన్నిహితులు ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేశారు.

Telugu Double Awards, Samantharuth, Tollywood-Movie

ఇప్పటికే ఓటీటీ అండ్‌ డిజిటల్ మార్కెట్ ఇన్నోవేషన్ అవార్డ్స్ 2021లో సమంత బెస్ట్ ఫిమేల్ లీడ్ అవార్డును సొంతం చేసుకోగా, తాజాగా ఫిల్మ్ ఛాంపియన్ డిస్రప్టర్స్ లో చోటు దక్కించుకోవడం విశేషం.ఇక ఈ జాబితాలో జాతిరత్నాలు నటుడు నవీన్ పోలిశెట్టి మూడవ స్థానంలో ఉండడం విశేషం.ఇలా ఈ జాబితాలో ఇద్దరు తెలుగు వాళ్లు చోటు సంపాదించుకోవడంతో పలువురు వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube