మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో ఏ, బీ డ్రైవ్‌లు ఎందుకు ఉండవో తెలుసా?

అది ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ అయినా దానిని ఉపయోగిస్తున్నప్పుడు డ్రైవ్ తప్పనిసరిగా ఉంటుంది.సి డ్రైవ్ మినహా, కంప్యూటర్‌లో ఇచ్చిన వివిధ డ్రైవ్‌లను యూజర్ తన సౌలభ్యం ప్రకారం ఉపయోగిస్తాడు.

 Do You Know Why Your Laptop Or Computer Has A And B Drives , A And B Drives , L-TeluguStop.com

అయితే కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌ సీ డ్రైవ్‌తోనే ఎందుకు ప్రారంభమవుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి ఏ లేదా బీ అని ఎందుకు పేరు పెట్టలేదు? దీని వెనుక గల కారణం ఏమిటో తెలుసా? డ్రైవ్‌కు ఏ లేదా బీ అని పేరు పెట్టకపోవడానికి కారణం ఫ్లాపీ డిస్క్.ప్రారంభ కంప్యూటర్లలో అంతర్గత స్టోరేజీ ఉండేదికాదు.దీంతో వినియోగదారు కంప్యూటర్‌లో దేనినీ సేవ్ చేయలేకపోయేవాడు.కంప్యూటర్‌లో చేసిన పనిని సేవ్ చేయడానికి ఫ్లాపీ డిస్క్ డ్రైవ్‌ను జోడించాల్సి వచ్చేది.దీనిని ఎ డ్రైవ్ అని పిలిచేవారు.కాలక్రమేణా స్టోరేజ్‌ను మెరుగుపరచడానికి రెండు రకాల ఫ్లాపీ డిస్క్‌లు సృష్టించారు.

మొదటిది 5 1/4 అంగుళాలు రెండవది 3 1/2 అంగుళాలు.ఇవి కంప్యూటర్‌కు అనుసంధానమైనప్పుడు ఏ డ్రైవ్ మరియు బీ డ్రైవ్ అని పేరు పెట్టారు.

అప్పటినుండి, కంప్యూటర్‌లో ఫ్లాపీ కోసం రెండు డ్రైవ్‌లు రిజర్వ్‌లో ఉంచారు.ఫ్లాపీ అనేది ఒక రకమైన స్టోరేజీ.

అందులో ఉండే మాగ్నెటిక్ స్టోరేజీలో డేటా స్టోర్ అవుతుంది.దుమ్ము, గీతలు నుండి దీనికి రక్షణ అవసరం.

అందుకే దీనిని కవర్లో ఉంచుతారు.దాదాపు దశాబ్దంన్నర క్రితం ఫ్లాపీ కాలం ముగిసిపోయింది.

ఫ్లాపీ డిస్క్ 1960లో ప్రవేశపెట్టారు.మొదటి ఫ్లాపీ డిస్క్ 8 అంగుళాలు.

తరువాత అది మరింత మెరుగుపడి దాని పరిమాణం తగ్గింది.కాలక్రమేణా కంప్యూటర్‌లో స్టోరేజ్ సిస్టమ్ అభివృద్ధి చేశారు.

ఆపరేటింగ్ సిస్టమ్ కోసం సీ డ్రైవ్ రూపొందించారు.అదే సమయంలో ఇతర డ్రైవ్‌లను యూజర్ తన సౌలభ్యం ప్రకారం ఉపయోగించవచ్చు, అయితే సీ డ్రైవ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కు మాత్రమే ఉపయోగిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube