మీ పిన్ నెంబర్,పాస్ వర్డ్ ఎవరికయినా చెప్పేసారా.. అయితే ఇలా చేయండి..!

రోజు రోజుకు సైబర్ నేరగాళ్ల అగాయిత్యాలు ఎక్కువ అయిపోతున్నాయి.అమాయకులను టార్గెట్ గా చేసుకుని వాళ్ళ అకౌంట్ లోని డబ్బులను మాయం చేసేస్తున్నారు.

 Did You Tell Anyone Your Pin Number And Password , Pin Numbers , Passwords , C-TeluguStop.com

ఈ మధ్యన సైబర్ నేరగాళ్ళు రూటు మార్చి రకరకాల ఫోన్స్ చేసి వారిని నమ్మించి వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్ సంపాదిస్తున్నారు.ఎంతో నమ్మశఖ్యంగా కాల్ చేసి ఫిషింగ్ పద్ధతులను అవలంభించి వారి అకౌంట్ కు సంబందించిన విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నారు.

వారి మాయలో పడి ఇప్పటికే చాలా మంది తమ డబ్బులను కోల్పోయారు.ఒకవేళ ఎవరైనా సైబర్ నేరగాళ్ల మాయలో పడి తమ ఖాతాకు సంబంధించిన వివరాలను గాని, పిన్ నంబర్ లేదా ఇతర విలువైన సమాచారాన్ని వాళ్లకు చెప్పినట్లయితే ఏం చేయాలో అని ఎస్బీఐ ముందస్తు జాగ్రత్తలు వెల్లడించింది.

మరి ఈ కింద చెప్పిన విధంగా పాటిస్తే మీ డబ్బులకు ఎటువంటి డోకా ఉండదు.నిజానికి ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తమ ఖాతాదారులకు అనేక సార్లు పాస్ వర్డ్, పిన్ సంబందించిన వివరాలను ఎవరికీ చెప్పవద్దని తెలిపింది.

కానీ పొరపాటున మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకుంటే ముందుగా మీరు ఇలా చేయాలి.ఫస్ట్ వినియోగదారుడు తన ఇంటర్నెట్ బ్యాంకిగ్ సేవలను లాక్ చేసి వెంటనే సంబంధిత బ్యాంక్ శాఖ లేదా క్రెడిట్ కార్డు విభాగాన్ని కాంటాక్ట్ అవ్వాలి.

జరిగిన ఘటనపై స్థానిక పోలీసులకు ముందుగా ఒక కంప్లెయింట్ ఇవ్వాలి.

ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా మోసగించడానికి చూస్తే అ వివరాలను వెంటనే [email protected] అనే మెయిల్ కు మెసేజ్ చేయాలి.

అలాగే మీ బ్యాంకు ఖాతా స్టేట్ మెంట్ కూడా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి.ఒకవేళ మీ ఖాతాలో మీకు సంబంధం లేని ట్రాన్సక్షన్స్ జరిగితే కనుక వెంటనే మీ బ్యాంకు బ్రాంచ్ ను సంప్రదించి విషయం తెలియజేయాలి.

అలాగే మీ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ , విశ్వసనీయ థర్డ్ పార్టీల పరిమితులను సున్నాకి సెట్ చేసుకోండి.అధికారికంగా బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్ లు, ఈ- మెయిల్ లను మాత్రమే ఓపెన్ చేయండి.

వేరే ఇతర మెయిళ్లు, మెసేజ్ లకు వీలైనంత వరకు ఓపెన్.చేయకుండా ఉండడమే మంచిది.

Did You Tell Anyone Your PIN Number And Password

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube