తాజాగా రాహుల్ అనే ఒక లింక్డ్‌ఇన్ యూజర్ షేర్ చేసిన రెండు ఫుడ్ ఆర్డర్ బిల్లులు ఇప్పుడు నెటిజన్లను షాక్‌కి గురి చేస్తున్నాయి.ఈ రెండు బిల్లులలో ఒకటి జొమాటోలో ఆర్డర్ చేసినది కాగా మరొకటి ఆఫ్‌లైన్‌లో ఆర్డర్ చేసింది.
ఈ యూజర్ తన రెండు ఆర్డర్‌లలో వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమో కొనుగోలు చేశారు.అయితే జొమాటోలో ఫుడ్ ఆర్డర్ బిల్లు రూ.75 డిస్కౌంట్ పోనూ రూ.689.90 కాగా సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీతో ఆఫ్‌లైన్ ఆర్డర్ బిల్లు రూ.512 అయింది.అంటే రూ.178 ఎక్కువగా బిల్లు అయింది.ఇక డిస్కౌంట్ లేకపోయినట్లయితే ఆ ధరతో ఒక బిర్యానీ కూడా వచ్చేది.ఇదే విషయాన్ని సదరు యూజర్ చెబుతూ ఆన్‌లైన్‌లో ఛార్జీల మోత భారీగా ఉందని, ఇది చాలా అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ధరల వ్యత్యాసం చూసిన తర్వాత నెటిజన్లు కూడా ఇది అన్యాయం అని పేర్కొంటున్నారు.సమీపంలో రెస్టారెంట్స్ ఉన్నవారు ఆన్‌లైన్‌లో కాకుండా ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే చాలా వరకు డబ్బు ఆదా చేసుకోవచ్చని మరికొందరు అంటున్నారు.
జొమాటో, స్విగ్గీ వంటి సంస్థలు కూడా తమ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి కాబట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నాయని కొందరు అంటున్నారు.కానీ ఈ ఛార్జీలు అడ్డగోలుగా ఉండటం కస్టమర్‌ని మోసం చేసినట్లు అవుతుందని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు.
అయితే లింక్డ్‌ఇన్ యూజర్ రాహుల్ ఆన్‌లైన్‌లో డెలివరీ అందించే కంపెనీలు ఎక్కువగా బిల్లు లేకుండా ప్రభుత్వం ఒక నియంత్రణ తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.అలాగే వాటాదారులు అందరికీ సమ న్యాయం జరగాలి అంటే బిల్లులపై అడ్డగోలుగా చార్జీలు విధించకుండా నిబంధనలు తీసుకురావాలని అన్నారు.ఈ యూజర్‌తో చాలామంది నెటిజన్లు ఏకీభవిస్తున్నారు.ఈ పోస్టు ఇప్పటికే వైరల్ గా మారింది దీనికి 10 వేలకు పైగా రియాక్షన్లు వందల కొద్దీ కామెంట్లు వచ్చాయి.