మహిళ చెవిలో ఇరుక్కున్న పీత.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్..

సోషల్ మీడియాలో డైలీ వైరలయ్యే వీడియోలు బోలెడన్ని ఉంటాయని చెప్పుకోవచ్చు.అయితే ఇందులో కొన్ని వీడియోలు చూస్తే మాత్రం ఆశ్చర్యపోక తప్పదు.

 Crab In The Woman Ear Viral Video Details, Women, Viral Latest, News Viral, Soc-TeluguStop.com

తాజాగా అలాంటి ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లకు ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.ఈ వీడియో లో ఒక పీత మహిళ చెవిలో ఇరుక్కుంది.

సాధారణంగా చెవుల్లో వస్తువులు ఇరుక్కుపోవడం చూసుంటాం.కానీ చెవిలో ఒక పీత స్టక్ అయిపోయిందని ఎక్కడా వినము.

ఎందుకంటే అది దాదాపు అసాధ్యం.ఇలాంటి అరుదైన ఘటనలు ఎప్పుడో ఒకసారి చోటు చేసుకుంటాయి.

తాజాగా అలాంటి అరుదైన ఘటన చోటుచేసుకున్న అందరినీ నివ్వెరపరుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే… ఓ మహిళ స్నానం చేసేందుకు ఒక సముద్రంలోకి దూకింది.

ఈ సమయంలోనే ఒక చిన్న పీత ఆమె చెవి లోకి దూరింది.అది బయటకు రాలేక అక్కడే ఇరుక్కుపోయింది.

దీంతో చెవిలో నొప్పితో ఆమె విలవిల్లాడింది.దీనిని బయటకు తీసేందుకు ఒక వ్యక్తి పట్టకారుని ఆమె చెవిలో దూర్చాడు.

ఇంతలోనే ఆ పీత అక్కడి నుంచి ఒక్కసారిగా బయటకు వచ్చింది.దీంతో ఆ మహిళ బాగా షాక్ అయ్యి గట్టిగా అరిచింది.

దీనికి సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు వామ్మో అని కామెంట్లు చేస్తున్నారు.చెవిలో నుంచి పీత బయటికి రావడం చూస్తుంటే తమ వొళ్లు గగుర్పొడిచింది అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

My Crazy Email అనే యూట్యూబ్ ఛానెల్​ ఈ వీడియోను అప్​లోడ్ చేసింది.దీనికి ఇప్పటికే 43 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి.మొదట టిక్​టాక్​లో వైరల్ ఐన ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్​లో కూడా వైరల్ అవుతుంది.దీన్ని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube