ఏపీలో కాంగ్రెస్ పార్టీ( AP Congress Party ) చచ్చిపోయిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( Minister Peddireddy Ramachandra Reddy ) తెలిపారు.గతంలో కాంగ్రెస్ లో ఉన్నవారంతా వైసీపీలోకి వచ్చేశామన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ కుట్రలో భాగంగానే సీఎం జగన్ పై( CM Jagan ) పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు( Chandrababu ) ఉచ్చులో ఉన్నంత వరకు షర్మిలను( Sharmila ) ప్రతిపక్షంగానే భావిస్తామని తెలిపారు.వైఎస్ కుటుంబం విడిపోవడానికి చంద్రబాబే కారణమని పేర్కొన్నారు.జగన్ ను జైల్లో పెట్టడానికి, రాష్ట్రం విడిపోవడానికి కూడా బాబే కారణమని విమర్శించారు.
అలాగే వైసీపీ ఏర్పాటుకు మూల కారణం కూడా చంద్రబాబేనని తెలిపారు.