జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తో పాటు ఆ పార్టీ మరో నాయకుడు నాదెండ్ల మనోహార్ ( Nadendla Manohar )పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.బకెట్ గుర్తు ఉన్న తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్( President Sheikh Jalil ) ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఈ క్రమంలోనే ఎన్నికల సంఘాన్ని కలిసి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహార్ తో పాటు బాలశౌరిపై కంప్లైట్ చేశామని జలీల్ వెల్లడించారు.పోటీ చేయొద్దని తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఈ నేపథ్యంలో బాలశౌరి తనపై గన్ గురిపెట్టి బెదిరించారన్న షేక్ జలీల్ జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉంటాయని తెలిపారు.అందుకే తమను పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని వెల్లడించారు.