జనసేనానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan Kalyan ) తో పాటు ఆ పార్టీ మరో నాయకుడు నాదెండ్ల మనోహార్ ( Nadendla Manohar )పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది.

బకెట్ గుర్తు ఉన్న తమ పార్టీ అభ్యర్థులను పోటీ చేయొద్దని పవన్ కల్యాణ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ నవరంగ్ పార్టీ అధ్యక్షుడు షేక్ జలీల్( President Sheikh Jalil ) ఈసీకి ఫిర్యాదు చేశారు.

ఈ క్రమంలోనే ఎన్నికల సంఘాన్ని కలిసి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహార్ తో పాటు బాలశౌరిపై కంప్లైట్ చేశామని జలీల్ వెల్లడించారు.

పోటీ చేయొద్దని తమ పార్టీ అభ్యర్థులను బెదిరిస్తున్నారని ఆరోపించారు.ఈ నేపథ్యంలో బాలశౌరి తనపై గన్ గురిపెట్టి బెదిరించారన్న షేక్ జలీల్ జనసేన గాజు గ్లాసు గుర్తు, తమ పార్టీ బకెట్ గుర్తు ఒకేలా ఉంటాయని తెలిపారు.

అందుకే తమను పోటీ చేయవద్దని బెదిరిస్తున్నారని వెల్లడించారు.

రజనీకాంత్ బర్త్ డే స్పెషల్.. ఈ స్టార్ హీరో గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?