దేశంలో నరేంద్ర మోదీనే( Narendra Modi ) మూడోసారి ప్రధాని కాబోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy ) అన్నారు.దేశంలో ఉగ్రవాదం, మాఫియా లేకుండా చేశారని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ( Congress party )గూండాలకు సపోర్ట్ చేస్తుందని ఆయన ఆరోపించారు.అయితే బీజేపీ( BJP ) పాలనలో అవినీతి అంతమైందని కిషన్ రెడ్డి వెల్లడించారు.
అదేవిధంగా మోదీ పాలనలో మహిళల ఆత్మ గౌరవం పెరిగిందన్నారు.మోదీ పాలనపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్న కిషన్ రెడ్డి మరోసారి కమలం పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.