కమెడియన్ పృథ్వి రాజ్ కి నెలకి 8 లక్షలు జరిమానా విధించిన కోర్టు..!

మన టాలీవుడ్ లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న కమెడియన్స్ లిస్ట్ తీస్తే అందులో పృథ్వి ముందు వరుసలో ఉంటాడు.ఇండస్ట్రీ లో ఆయన ఎంతో కాలం ఉంది ఉన్నప్పటికీ కూడా , మంచి పాపులారిటీ ని సంపాదించుకుంది మాత్రం ‘ఖడ్గం’ సినిమాతోనే.

 Comedian Prithvi Raj Was Fined 8 Lakhs Per Month By The Court , 8 Lakhs Per Mon-TeluguStop.com

ఈ సినిమాలో 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అంటూ పృథ్వి చెప్పిన డైలాగ్ ఎంత ఫేమస్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే.ఈ సినిమా తర్వాత నుండి అందరూ పృథ్వి ని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి ( Prithvi Raj )అంటూ పిలవడం ప్రారంభించారు.

ఆ పేరుతోనే ఫేమస్ అయ్యాడు కూడా.అయితే ఈయన కమెడియన్ గా ఆడియన్స్ కి బాగా సుపరిచితం కానీ, క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా అప్పట్లో గొప్పగా పేరు తెచ్చుకున్నాడు.

అలా ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలు పోషించిన పృథ్వి రాజకీయాల్లో కూడా అడుగుపెట్టిన సంగతి మన అందరికీ తెలిసిందే.

Telugu Lakhs Per, Kavitha, Prithvi Raj, Tollywood-Movie

2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ( YCP party )తరుపున ప్రచారం చేసి మంచి ప్రాచుర్యం సంపాదించిన పృథ్వి కి వైసీపీ సర్కార్ టీటీడీ చైర్మన్ పదవి ని ఇచ్చింది.కొంతకాలం టీటీడీ చైర్మన్( TTD Chairman ) గా పని చేసిన పృథ్వి రాసలీలలు ఒక్కసారిగా బయటపడేసరికి స్వచ్చంధంగా ఆయనే ఆ పదవి కి రాజీనామా చేసాడు.ఇక అప్పటి నుండి జనసేన పార్టీ కి సపోర్టుగా ఉంటూ వస్తున్నా పృథ్వి ప్రస్తుతం సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా బిజీ గా ఉంటున్నాడు.

ఇకపోతే పృథ్వి రాజ్ తన సతీమణి కవిత( kavitha ) కి విడాకులు ఇస్తున్నట్టు కోర్టు లో పిటీషన్ పెట్టి చాలా కాలం అయ్యింది.అందుకు కవిత కూడా ఒప్పుకుంది.

అయితే అలీమొనీ క్రింద ప్రతీ నెల పృథ్వి తన మాజీ భార్యకి 8 లక్షల రూపాయిలు ఇవ్వాలంటూ కోర్టు తీర్పు ఇచ్చింది.ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద చర్చకి దారి తీసిన అంశం.

Telugu Lakhs Per, Kavitha, Prithvi Raj, Tollywood-Movie

పృథ్వి నేరుగా మీడియా ముందుకు వచ్చి ఇదెక్కడి అన్యాయం, నెలకి 8 లక్షలు నేను ఎక్కడి నుండి తీసుకొచ్చేది.ఇంతకు ముందు లాగ నాకు సినిమా అవకాశాలు కూడా రావడం లేదు, చాలా క్లిష్టమైన ఆర్ధిక పరిస్థితిని ఎదురుకుంటున్నాను, ఇలాంటి అన్యాయపూరితమైన తీర్పుని న్యాయస్థానం ఇస్తుందని అనుకోలేదు.నా నెల సంపాదన ఎంతో ఒకసారి పరిశీలిస్తే జడ్జి గారికి ఒక అవగాహన వస్తుంది అంటూ ఆరోపించాడు పృథ్వి.ప్రస్తుతం ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.

మరి కోర్టు పృథ్వి వాదనని పరిగణలోకి తీసుకుంటుందా?, లేదా పృథ్వి తన భార్య తో ఏదైనా సెటిల్మెంట్ చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube