'సలార్‌' రెండు పార్ట్‌ లు... ప్రశాంత్ నీల్ ఏమన్నాడంటే!

ప్రభాస్‌ హీరోగా కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా గురించి గత ఏడాది కాలం గా ఏదో ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంది.అయితే ఈమద్య కాలంలో ఒక వార్త అందరి దృష్టిని తెగ ఆకర్షిస్తోంది.

 Clarity About Salaar Movie Two Parts , Salaar, Prabhas, Prashanth Neel , Tollywo-TeluguStop.com

ప్రశాంత్ నీల్‌ సలార్‌ సినిమా ను రెండు పార్ట్‌ లుగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు.రెండు పార్ట్‌ లకు కూడా ఒకే సారి షూటింగ్ ను చేస్తున్నాడు.

రెండు పార్ట్‌ లను కూడా మూడు లేదా నాలుగు నెలల గ్యాప్ లో విడుదల చేయబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున మీడియా లో వార్తలు వచ్చాయి.ఆయన గత చిత్రం కేజీఎఫ్‌ కూడా రెండు పార్ట్‌ లు గా వచ్చింది.

ప్రభాస్ ఇంతకు ముందు సినిమా బాహుబలి రెండు పార్ట్‌ లుగా వచ్చింది.తాజాగా పుష్ప సినిమా రెండు పార్ట్‌ లు.రెండు పార్ట్‌ లు అనేది ఈమద్య కాలంలో సక్సెస్ ఫార్ముల అయ్యింది.

అందుకే సలార్‌ ను కూడా రెండు పార్ట్‌ లు గా విడుదల చేయడం ద్వారా మంచి లాభాలను దక్కించుకోవచ్చు అనేది ప్రశాంత్ నీల్ ప్లాన్ అంటూ ఒక ప్రముఖ మీడియా సంస్థ కూడా తన కథనంలో పేర్కొనడం జరిగింది.

ఆ విషయమై దర్శకుడు ప్రశాంత్‌ నీల్ నుండి కన్నడ మీడియా వర్గాల వారు క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశారు.సలార్‌ సినిమాను రెండు పార్ట్‌ లు గా చేస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఆయన కన్నడ జర్నలిస్ట్‌ కు ఫోన్ ద్వారా తెలియజేశాడట.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Sruthi Hassan, Tollywood-Movie

.ప్రశాంత్‌ నీల్ తనతో సలార్‌ రెండు పార్ట్‌ ల విషయాన్ని క్లారిటీ ఇచ్చాడంటూ ఆ కన్నడ జర్నలిస్ట్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు.మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం ఎవరు కూడా దాన్ని నమ్మవద్దు.ప్రభాస్ అభిమానులు సలార్‌ గురించి వచ్చిన వార్తలతో గందరగోళంకు గురి అయ్యారు.తాజాగా క్లారిటీ రావడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube