Jr NTRకి రాజకీయంగా అసలైన శత్రువులు ఎవరు?

ఎన్టీఆర్ మనవడిలా జూనియర్ ఎన్టీఆర్ ప్రవర్తించడం లేదని చంద్రబాబు నాయుడు, వారి హార్డ్‌కోర్ ఫాలోవర్లకు మద్దతిచ్చే కొందరు టీడీపీ నేతలు అంటున్నారు.తన అత్త భువనేశ్వరిని అవమానించినప్పుడు, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు ఆయన స్పందించిన తీరుపై వారికి తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి.

 Jr Ntrకి రాజకీయంగా అసలైన శత్రువు�-TeluguStop.com

జూనియర్ ఎన్టీఆర్ నుండి వారు ఏమి ఆశిస్తున్నారు? జగన్ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన పంచ్ డైలాగ్స్ వేయాలనుకుంటున్నారా? కొడాలి నాని, వల్లభనేని వంశీపై విరుచుకుపడడాన్ని వారు చూడాలనుకుంటున్నారా?

అయితే ఘాటుగా స్పందించకపోవడానికి గల కారణాలను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్‌ని చంద్రబాబు అండ్ కో.బాలకృష్ణ ఎప్పుడూ తన సొంత అన్న కొడుకుగా భావించి లేదని ఎన్టీఆర్ అభిమానులు అంటున్నారు.తన తల్లిని నందమూరి కుటుంబ సభ్యులు అవమానించడంతో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కుంటుంబానికి దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు.

అయితే 2009లో టీడీపీ తరపున ప్రచారం చేసేందుకు ముందుకు వచ్చి ప్రమాదానికి గురయ్యారని.అంతా జూనీయర్ ఎన్టీఆర్‌ను చంద్రబాబు గుర్తించలేదు అంటున్నారు.మరి అలాంటప్పుడు ముఖ్యంగా భువనేశ్వరికి జరిగిన అవమానాన్ని బహిరంగంగా ఎందుకు ఖండించాలని అంటున్నారు.

Telugu Balakrishna, Bhuvaneshwari, Cmjagan, Dr Ysr, Ntr, Chandrababu, Nandamuri,

ఎన్నికలు సమీపిస్తుండడంతో వైసీపీ ప్రధాన ప్రతి పక్షం టీడీపీని టార్గెట్ చేసింది.దీని కోసం పక్కా ప్రణాళికతో ముందుకు పోతుంది.ప్రజల్లోనే కాకుండా నందమూరి కుటుంబంలో కూడా విభేదాలు వచ్చేలా చేసి టీడీపీని బలహినపరచాలని వైసీపీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి.

జూనియర్ ఎన్టీఆర్‌కు చంద్రబాబు ప్రధాన శతృవు అని.నందమూరి కుటుంబాన్ని బాబు అవమానిస్తున్నాడు అనే ప్రచారాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాలని వైసీపీ ఆలోచిస్తున్నట్లు రాజకీయ విశ్లేకులు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube