దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది.
ఈ నోటీసుల్లో సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.కాగా మనీష్ సిసోడియా, రామచంద్ర పిళ్లైని సీబీఐ అధికారులు కలిపి ప్రశ్నించనున్నారు.
అయితే ఇప్పటికే ఈ కేసులో విజయ్ నాయర్, అభిషేక్ రావు బోయినపల్లిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.వీరి కస్టడీలో అధికారులు పలు కీలక విషయాలను రాబట్టినట్లు సమాచారం.