మంచు విష్ణు తన సినీ కెరీర్ లో నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువగా ఉన్నాయి.ఢీ, దూసుకెళ్తా, దేనికైనా రెడీ సినిమాలు మాత్రమే విష్ణుకు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టడంతో పాటు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి.
జిన్నా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావించిన మంచు విష్ణు ఈ సినిమా కోసం టాప్ టెక్నీషియన్లు పని చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు.తాజాగా జిన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో విష్ణు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.
జిన్నా మూవీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెప్పిన మంచు విష్ణు ప్రేక్షకులందరూ జిన్నా మూవీ చూసి ఆదరించాలని అన్నారు.ప్రభుదేవా అడగగానే వచ్చి ఈ సినిమాలోని సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారని విష్ణు తెలిపారు.
చెక్ ఇస్తే ప్రభుదేవా తీసుకోలేదని తమ్ముడి సాంగ్ కు కొరియోగ్రఫీ చేస్తే డబ్బులు తీసుకోనని అన్నాడని విష్ణు చెప్పుకొచ్చారు.
నాన్న మోహన్ బాబులో నాకు అన్నీ ఇష్టమేనని విష్ణు వెల్లడించారు.
అయితే నాన్న కోపం మాత్రం నచ్చదని విష్ణు చెప్పుకొచ్చారు.నా భార్య కంటిచూపుతోనే బెదిరిస్తుందని నా తల్లి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే విషయంలో దిట్ట అని విష్ణు అన్నారు.
నా కూతుళ్లు అరియానా, వివియానా ఈ సినిమా కోసం సాంగ్ పాడారని విష్ణు కామెంట్లు చేశారు.మోహన్ బాబు మాట్లాడుతూ ఈ వేడుకలో తక్కువగా మాట్లాడాలని నా కొడుకు విష్ణు చెప్పాడని అన్నారు.

విష్ణు ఏ సినిమాకు కష్టపడని స్థాయిలో ఈ సినిమా కోసం కష్టపడ్డాడని మోహన్ బాబు తెలిపారు.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకు మూలకథ అందించారని మోహన్ బాబు కామెంట్లు చేశారు.డైరెక్టర్ సూర్య ఈ సినిమాను బాగా తెరకెక్కించారని మోహన్ బాబు కామెంట్లు చేశారు. మోహన్ బాబు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.విష్ణు జిన్నా మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.







