తెలంగాణలో మూడోసారి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ( BRS )బిజెపి , కాంగ్రెస్ ల కంటే ముందుగానే 115 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించింది.నాలుగు స్థానాల్లో అభ్యర్థుల విషయంలో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండడంతో ఆ సీట్లను ఖరారు చేయకుండా వెయిటింగ్ లో పెట్టారు.
అయితే కాంగ్రెస్ , బిజెపిలు( Congress BJP ) తమ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో మిగిలిన నాలుగు స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ఖరారు చేశారు.అయితే అధికారికంగా ఆ పేర్లు ప్రకటించలేదు.
![Telugu Asembly Tickets, Brs, Brs Ticket, Cm Kcr, Congress, Telangana-Politics Telugu Asembly Tickets, Brs, Brs Ticket, Cm Kcr, Congress, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/Telangana-government-Telangana-Congress-BJP-asembly-tickets-Telangana-electionsCM-KCR-BRS-ticket.jpg)
మల్కాజ్ గిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావును( Mynampally Hanumantha Rao ) బీఆర్ఎస్ ప్రకటించినా, ఆయన తన కుమారుడు రోహిత్ కు టికెట్ ఇవ్వలేదనే అసంతృప్తితో పార్టీని వీడారు.అక్కడ కొత్త అభ్యర్థిని కేసీఆర్ ఎంపిక చేశారు.అతి త్వరలోనే రెండు జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.అలాగే కాంగ్రెస్ బిజెపిలోని అసమ్మతి నేతలను ఎన్నికల సమయం నాటికి బీఆర్ఎస్ లో చేర్చుకునేందుకు కేసిఆర్ వ్యవహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.
గత నెల 21న తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు గాను, 115 స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు .పెండింగ్ లో పెట్టిన జనగామ, నరసాపూర్ గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ తాజాగా ఖరారు చేశారు.వీరు క్షేత్రస్థాయిలో పనిచేసుకోవాలని సూచించారు.
![Telugu Asembly Tickets, Brs, Brs Ticket, Cm Kcr, Congress, Telangana-Politics Telugu Asembly Tickets, Brs, Brs Ticket, Cm Kcr, Congress, Telangana-Politics](https://telugustop.com/wp-content/uploads/2023/09/BRS-BRS-party-Telangana-government-Telangana-Congress-BJP-asembly-tickets-Telangana-electionsCM-KCR-BRS-ticket.jpg)
పల్లా రాజేశ్వర్ రెడ్డి ( Palla Rajeshwar Reddy )(జనగామ), సునీత లక్ష్మారెడ్డి, (నరసాపూర్), మర్రి రాజశేఖర్ రెడ్డి,( Marri Rajasekhar Reddy ) ( మల్కాజ్ గిరి) నందకిషోర్ వ్యాస్ బిలాల్ (గోషామహల్) పేర్లను త్వరలోనే ప్రకటించమన్నారు.ఇక నాంపల్లి అభ్యర్థి విషయంలో మరో రెండు రోజుల్లో క్లారిటీ రాబోతున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.ఇది ఇలా ఉంటే బీఆర్ఎస్ అసెంబ్లీ టికెట్ ఆశించి బంగపడిన నేతలు అనేకమంది కాంగ్రెస్ బిజెపి లలో చేరేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో, వారిని బుజ్జగించేందుకు కెసిఆర్ కేటీఆర్ తో పాటు, మంత్రి హరీష్ రావు రంగంలోకి దిగారు .వారితో చర్చలు జరుపుతూ పార్టీని వీడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .ఇప్పటికే దాదాపు 20 మంది కీలక నేతలు పార్టీనీ వీడారు.దీంతో ఇక ఏ నేత చేజారి పోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని, కీలక పదవులు ఇవ్వడంతో పాటు, అన్ని విధాలుగా ప్రాధాన్యం కల్పిస్తామని హామీని ఇస్తూ, వారు పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.