ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఒకరిగా పేరు తెచ్చుకోవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) .రాజా వారు రాణి గారు అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ఈ హీరో మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించాడు.
![Telugu Kiran Abbavaram, Rahasya Gorak, Rajavaaru, Ranjann, Tollywood-Latest News Telugu Kiran Abbavaram, Rahasya Gorak, Rajavaaru, Ranjann, Tollywood-Latest News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Kiran-Abbavaram-Neha-Shetty-Rules-Ranjan.jpg)
ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, వినరో భాగ్యం విష్ణు కథ, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, సమ్మతమే వంటి సినిమాలతో అలరించారు.ఇక త్వరలోనే ఈయన నటించిన రూల్స్ రంజన్ ( Rules Ranjann ) సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇదిలా ఉంటే తాజాగా కిరణ్ అబ్బవరం తన సొంత ఇంటి కల నెరవేరింది అంటూ తన ఇంటికి సంబంధించిన గృహప్రవేశ వేడుక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
![Telugu Kiran Abbavaram, Rahasya Gorak, Rajavaaru, Ranjann, Tollywood-Latest News Telugu Kiran Abbavaram, Rahasya Gorak, Rajavaaru, Ranjann, Tollywood-Latest News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Hero-Kiran-Abbavaram-House-Warming-Ceremony-Video-Viral.jpg)
ఎప్పటినుండో ఓ ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నానని, కానీ నా కల ఇప్పుడు నెరవేరిందని, నా సొంత ఊరిలో ఇల్లు కట్టుకోగలిగాను అంటూ తన ఇంటికి సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు.ఇక ఇదంతా బాగానే ఉంది కానీ ఈ వీడియోని నిశితంగా గమనిస్తే గనుక ఇందులో ఒక అమ్మాయి మనకు కనిపిస్తుంది.ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు రాజా వారు రాణి గారు ( Raja Vaaru Rani Gaaru ) సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించిన హీరోయిన్ రహస్య గోరక్.
ఈమె కిరణ్ అబ్బవరం గృహప్రవేశ వేడుకలలో పాల్గొని పూలు గుచ్చుతూ కనిపించింది.ఇక ఈ వీడియోలోని ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో వీరిద్దరి మధ్య మరోసారి ప్రేమ వార్తలు వినిపిస్తున్నాయి.
ఎందుకంటే రాజావారు రాణి గారు సినిమాలో నటించినప్పటినుండి కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ ( Rahasya Gorak ) మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అని టాక్ వినిపించినప్పటికీ వీళ్ళు ఎక్కడా కూడా బయటపడలేదు.
![Telugu Kiran Abbavaram, Rahasya Gorak, Rajavaaru, Ranjann, Tollywood-Latest News Telugu Kiran Abbavaram, Rahasya Gorak, Rajavaaru, Ranjann, Tollywood-Latest News](https://telugustop.com/wp-content/uploads/2023/09/Hero-Kiran-Abbavaram-Rahasya-Gorak-House-Warming-Ceremony-Video-Viral.jpg)
కానీ మొదటిసారి ఇలా కిరణ్ అబ్బవరం గృహప్రవేశ వేడుకల్లో పాల్గొనేసరికి అందరూ నిజమే అనుకుంటున్నారు.అంతేకాదు వీరి పెళ్లికి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవడం వల్లే నేరుగా రహస్య గృహప్రవేశ వేడుకల్లో (Kiran Abbavaram House Warming) పాల్గొని సందడి చేసిందని కామెంట్లు పెడుతున్నారు.