యోగా ఎంతో మందికి ఎన్నో రకాలుగా లాభాలు చేకుర్చే ప్రాసెస్.అందుకే దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా యోగాకు మంచి గుర్తింపు వస్తోంది.
మన దగ్గరే కాకుండా విదేశాల్లో కూడా యోగా డేను సెలబ్రెట్ చేసుకుంటుంటారు.అయితే పలు విషయాల్లో ఎంతో శక్తి వంతంగా పని చేసే యోగా.
బీపీ విషయంలోను పని చేస్తుందని పలువురు చెబుతున్నారు.యోగాతో బీపీని ఖతం చేయొచ్చని సూచిస్తున్నారు.
అవేంటో ఇప్పుడ చూసేద్దాం వచ్చేయండి.
ఈ రెడిమెట్ మందులు వాడీ వాడీ చాలా మంది విసుగు చెందుతారు.
అలాంటి వాళ్లు యోగాని ట్రై చేస్తే మంచి ఫలితాలు వస్తాయని పలువురు చెబుతుంటారు.అలా చేసిన వారు కూడా మంచి ఫలితాలు వచ్చాయని చెబుతారు.
అయితే యోగా ప్రాచీన ఫిజికల్ యాక్టివిటీ అని అంటుంటారు.దీంతో ఎన్నో లాభాలు ఉన్నాయని పలువురు అంటుంటారు.
మనసిక ప్రశాంతత, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెబుతుంటారు.

రోజు యోగాను చేయడం వలన రక్త ప్రసరణ మంచిగుంటుందని చెబుతుంటారు.అయితే ఈ యోగా వల్ల హైబీపీతో బాధపడేవారు కూడా మంచి ఫలితాలు పొందుతున్నారని పలువురి మాట వాటిని ఎలా చేయాలంటే.ఉత్తానాసనం.
ఈ ఆసనం వేయడానికి ఒక కుర్చి ముందు నిలబడి.చేతులను పక్కకు ఉంచాలి.
తర్వాత శ్వాసను గట్టిగా పీల్చాలి.రెండు చేతులను సీలింగ్ దిక్కు ఎక్స్టెండ్ చేయాలి.
తర్వాత శ్వాసను వదలాలి.ముందుకు వంగి ముంజేతులను కుర్చిపై ఉంచాలి.
చేతులపై నుదుటిని ఉంచాలి.ఇలా పది పదిహేను సార్లు శ్వాసను తీసుకోవాలి.
మరో ఆసనం అధోముఖ స్వానాశనం.ఇందులో ముందుగా రెండు చేతులు, రెండు కాళ్లను భూమిపై ఆనేలా ఉంచాలి.భుజాలు నేరుగా మణికట్టు కింద అలాగే తుంటి కింద మోకాళ్లను ఉంచాలి.తర్వాత శ్వాసను తీసుకోవాలి.
హిప్స్ ను మెల్లగా పైకి లేపాలి.అదే సమయంలో మోచేతులను, మోకాళ్ళను స్ట్రైట్ గా చేయాలి.
తిరగేసిన వి షేప్ లో మీరుండాలి.తర్వాత నేలపై చేతులను ప్రెస్ చేయాలి.
మెడను స్ట్రైట్ గా చేయాలి.తలను తల దిండుపై ఆనించాలి.
తర్వాత చెవులను చేతులతో టచ్ చేయాలి.ఇలా ఒక 30 నిమిషాలు ఉండాలి.
ఇలా పలు ఆసనాలు ఉంటాయి.కానీ వీటిని నిపుణుల ఆధ్వర్యంలోనే నేర్చుకోవాలి.