చి.. చి.. విజయ్ దేవరకొండ సినిమా కోసం ఇంతలా దిగజారాడా ?

సినీ ఇండస్ట్రీలో సింగిల్ కావడం మింగిల్ కావడం చాలా కామన్.ఈ విషయాలను ఎవరూ ఎక్కువగా పట్టించుకోరు.

 Breakup Is Real Or Fake Of Vijay Devarakonda Details, Pushpaka Vimanam, Anand De-TeluguStop.com

కానీ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఈ విషయం గురించి తెగ చర్చించుకుంటున్నారు.ఇంతకీ ఏమైందా? అని ఆలోచిస్తున్నారా.మరేం లేదండీ.టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తనకు కొద్ది రోజుల కిందటే బ్రేకప్ అయిందంటూ పెద్ద బాంబు పేల్చాడు.రౌడీ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన పుష్పకవిమానం సినిమా ప్రమోషన్ కోసం విజయ్ దేవరకొండ ఈ ఇంటర్వ్యూను ఇచ్చాడు.పుష్పకవిమానం సినిమాను స్వయంగా విజయ్ దేవరకొండనే ప్రొడ్యూస్ చేస్తుండడం గమనార్హం.

ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కినట్లుగా తెలుస్తోంది.

కానీ కొంత మంది విజయ్ దేవరకొండకు బ్రేకప్ అయిందంటే నమ్మడం లేదు.ఇదంతా తన తమ్ముడి సినిమా ప్రమోషన్ కోసం ఆడుతున్న డ్రామా అని కొట్టి పారేస్తున్నారు.

తమ్ముడి సినిమాకు హైప్ తీసుకురావడం కోసం విజయ్ ఇలా జిమ్మిక్కులు ప్లే చేస్తున్నాడని ఆరోపిస్తున్నారు.కొంత మంది మాత్రం ఇది నిజమే కావొచ్చు అని తేలుస్తున్నారు.ఆ మధ్య రౌడీ దేవరకొండ లవ్ లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

Telugu Nationalcrush, Tollywood-Movie

నేషనల్ క్రష్ రష్మిక అని కొంత మంది వార్తలు రాయగా.అదేం లేదు ఓ ఇంగ్లీష్ అమ్మాయితో విజయ్ ప్రేమలో మునిగి తేలుతున్నాడంటూ కొంత మంది చర్చించుకున్నారు.కానీ ఈ రెండు విషయాల్లో నిజం లేదని తర్వాత తేలిపోయింది.

మరి ఇప్పుడు విజయ్ చెప్పినట్లు తనకు రీసెంట్ గా బ్రేకప్ అయిందా? లేకపోతే అందరూ చర్చించుకుంటున్నట్లుగా తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ నటించిన పుష్పక విమానం సినిమా కోసం విజయ్ అబద్దాలు చెబుతున్నాడా? అని తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube