తులసి చెట్టును, తులసి ఆకులను భారతీయులు ఎంత పవిత్రంగా భావిస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఆయుర్వేదంలో ఉపయోగపడే తులసి ఆకుల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జ్వరం, దగ్గు, ఫ్లూ సమస్యలతో బాధపడేవారు కొన్ని తులసి ఆకులు నమలడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.ఇక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆశ్చర్య పరిచే సౌందర్య ప్రయోజనాలు కూడా అద్భుతంగా ఉన్నాయి.
మరి ఆ సౌందర్య ప్రయోజనాలు ఏంటీ అన్నది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.మొటిమలు, మచ్చలు సమస్యలతో బాధపడుతున్నవారికి తులసి అద్భుతంగా సహాయపడుతుంది.
అలాంటి వారు కొన్ని తులసి ఆకులను తీసుకుని బాగా పేస్ట్ చేసుకోవాలి.ఆ పేస్ట్‌లో చిటికెడు పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.పది లేదా పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల క్రమంగా మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.అలాగే కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించాలి.
అనంతరం ఆ నీటిని చల్లారనిచ్చి.ముఖానికి అప్లై చేయాలి.
పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉన్న ముడతలు పోయి.
చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది.
ఇక తులసి ఆకులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.
ఆ పొడిలో కొద్దిగా తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని.ముఖానికి అప్లై చేయాలి.
ఇరవై నిమిషాల పాటు బాగా ఆరనిచ్చి.అనంతరం గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయడం వల్ల ముఖం మంచి కలర్ వస్తుంది.మరియు చర్మం మృదువుగా మారడంతో పాటు ఫ్రెష్‌గా కనిపిస్తుంది.