టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం బాలయ్య బాబు వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
సినిమా హిట్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ బిజీబిజీగా గడుపుతున్నారు బాలయ్య బాబు.ఈ ఏడాది ఆరంభంలో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి( Anilravipudi ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా అఖండ సినిమా తర్వాత బాలయ్య బాబు కెరియర్ నెమ్మదించిందని చెప్పవచ్చు.
బాలయ్య బాబు సినిమాలకి పట్టుమని పది కోట్లు షేర్ రాబట్టలేని స్థితికి ఆయన చేరారు.వరుస పరాజయాలతో మార్కెట్ పూర్తిగా దెబ్బతింది.రూలర్ అయితే సాయి ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే చిత్రం ముందు తేలిపోయింది.
ఇక బాలయ్య బాబు పని అయిపోయింది అనుకుంటున్న తరుణంలో అఖండ రూపంలో ఆయనకు బ్రేక్ వచ్చింది.కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు.చెప్పాలంటే అఖండ బాలయ్యకు మరో జన్మనిచ్చింది.మరలా బాలయ్యతో చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
వీరసింహారెడ్డితో సక్సెస్ ట్రాక్ కొనసాగించిన బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో 108వ చిత్రం చేస్తున్నారు.
కాగా బాలయ్య ఒక క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేశాడు.రజినీకాంత్, శివరాజ్ కుమార్( Rajinikanth, Shivaraj kumar ) లతో ఆయన భారీ ప్రాజెక్ట్ చేస్తున్నారు.రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ మల్టీస్టారర్ లో బాలకృష్ణ మెయిన్ హీరోగా నటించనున్నాడు.
రజినీకాంత్, శివ రాజ్ కుమార్ చెరో పార్ట్ లో కనిపించనున్నారట.ఈ మూవీపై శివ రాజ్ కుమార్ ఇప్పటికే దీనిపై ప్రకటన చేశారు.
మే 20న హైదరాబాద్ లో జరిగిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు అతిథిగా హాజరైన శివరాజ్ కుమార్, బాలయ్య, నేను బ్రదర్స్ లాంటి వాళ్ళం.గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాను.
త్వరలో బాలకృష్ణ, నేను కలిసి ఒక భారీ సినిమా చేయబోతున్నాము అని తెలిపారు.ఈ మాటతో స్టేజ్ దద్దరిల్లింది.
అయితే శివరాజ్ కుమార్ చెప్పిన ప్రాజెక్ట్ రెండు భాగాలుగా రానుందట.మొదటి పార్ట్ లో బాలకృష్ణ రజినీకాంత్ హీరోలుగా నటిస్తారట.
సెకండ్ పార్ట్ లో బాలకృష్ణ,శివరాజ్ కుమార్ నటించనున్నారట.కన్నడ దర్శకుడు తెరకెక్కించే ఈ ప్రాజెక్ట్ ని శివరాజ్ కుమార్ స్వయంగా నిర్మిస్తున్నారట.పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల కానుందట.