బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపిన ఆశ వర్కర్లు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తమ సమస్యలను పరిష్కరించాలని ఆశ వర్కర్లు చేస్తున్న సమ్మె ఈరోజుకు 13వ రోజుకు చేరుకుంది.అందులో భాగంగా ఈరోజు ఆశ వర్కర్లు తమ పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద బతుకమ్మ ఆడుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు.

 Asha Workers Protested By Playing Bathukamma, Asha Workers, Asha Workers Protest-TeluguStop.com

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ మాట్లాడుతూ ఆశా వర్కర్లు 13 రోజులుగా సమ్మె చేస్తున్న కూడా ప్రభుత్వం వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు.నిన్న వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ఆశ వర్కర్లు

తమ సమస్యలపై వినతిపత్రం అందించడానికి వెళ్లిన సందర్భంగా అక్కడ సిఐటియు నాయకులను కించపరిచే విధంగా పనికిమాలిన సంఘాలు , నాయకులు అని వ్యాఖ్యనించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే మంత్రి కేటీఆర్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలవడానికి సంఘాల మద్దతు అడిగి , మద్దతు తీసుకొని ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు మంత్రి స్థానంలో కొనసాగుతున్నారన్న విషయాన్ని మరిచిపోయినట్టు ఉన్నారన్నారు.ఇప్పటికైనా వెంటనే ఆశ వర్కర్లతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాలని లేకుంటే ఎమ్మెల్యేలు , మంత్రులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఈరోజు ఆశ వర్కర్ల సమ్మె 13వ రోజు సందర్భంగా సిరిసిల్ల పట్టణం నెహ్రు నగర్ కు చెందిన శివాని పుట్టినరోజు సందర్భంగా ఆమె తల్లిదండ్రులు దాదాపు 300 మంది ఆశా వర్కర్లకు అల్పాహారాన్ని అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆశా వర్కర్లందరూ శివాని కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ , ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్షురాలు మంజుల కార్యదర్శి జయశీల భారతి , కస్తూరి , శాంత , రుచిత లావణ్య , చంద్రకళ , లత ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube