ప్రభుత్వాసుపత్రులను మరింత అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారని అనకాపల్లి ఎంపీ బీబీ సత్యవతి,జిల్లా కలెక్టర్ రవి పట్టం శెట్టి అన్నారు.అనకాపల్లి జిల్లా ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో జిల్లా కలెక్టర్ రవి పట్టెం శెట్టి ఆధ్వర్యంలో మొదటిసారిగా అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంపీ బీవీ సత్యవతి పాల్గొన్నారు.ఈ అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆసుపత్రి లో ఉన్న పలు సమస్యలపై కలెక్టర్ రవి పట్టెం శెట్టి ఎంపీ బీబీ సత్యవతిలు చర్చించారు.
ప్రభుత్వ ఆస్పత్రినీ అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన సత్యవతి అన్నారు .ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేస్తామని కలెక్టర్ రవి అన్నారు.సిటీ స్కాన్ సమస్యను కూడా పరిష్కరిస్తామని, ప్రసూతి విభాగంలో మరింత సేవలను అందుబాటులో ఉంచుతామని కలెక్టర్ రవి పట్టెమ్ శెట్టి అన్నారు.ఈ అభివృద్ధి కమిటీ సమావేశంలో డీఎంహెచ్వో విజయలక్ష్మి ఎన్ టి ఆర్ హాస్పిటల్ సూపర్డెంట్ శ్రవణ్ కుమార్ వైద్యాలయం సిబ్బంది ఈ అభివృద్ధి కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.