రౌడీ స్టార్ ఫ్యాన్స్ ను నిరాశ పర్చిన మైత్రి మూవీ మేకర్స్‌

రౌడీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన లైగర్‌ సినిమా విడుదలకు సిద్దం గా ఉంది.ఆగస్టు లో సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

 Vijay Devarakonda Fans Fire On Mytri Movie Makers Vijay Devarakonda , Mytri Mov-TeluguStop.com

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా లో కూడా విజయ్ దేవరకొండ నటిస్తున్న విషయం తెల్సిందే.ఈ రెండు సినిమా లు కాకుండా జనగణమన సినిమా ను కూడా పూరి దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఈ మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ తో అభిమానులకు సర్‌ ప్రైజ్ ఇవ్వాలని రౌడీ స్టార్‌ భావించాడు.కాని మైత్రి మూవీ మేకర్స్ లో శివ నిర్వాన దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయిన కారణం గా ఇప్పుడు ఫస్ట్‌ లుక్ ను ఇవ్వలేం అంటూ క్లారిటీ ఇచ్చారు.

అతి త్వరలోనే అంటే మూడు నాలుగు రోజుల్లోనే పస్ట్‌ లుక్ ను ఇవ్వబోతున్నట్లుగా వారు తెలియజేశారు.దాంతో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

లైగర్‌ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యింది కనుక దాని నుండి పాట వచ్చింది.శివ నిర్వాన కూడా కనీసం ఫస్ట్‌ లుక్‌ అయినా విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక చిన్న వీడియోను విడుదల చేసి ఫస్ట్‌ లుక్ రాబోతుంది.హ్యాపీ బర్త్‌ డే విజయ్ దేవరకొండ అంటూ చెప్పడం జరిగింది.ఈ మాత్రం దానికి అవసరమా అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.మొత్తానికి విజయ్‌ దేవరకొండ అభిమానులు మైత్రి మూవీ మేకర్స్ వారి పై అసంతృప్తి తో ఉన్నారు.

ఈ అసంతృప్తి త్వరలో రాబోతున్న ఫస్ట్‌ లుక్ ను చూసే వరకు ఉండవచ్చు. ఈ సినిమా లో విజయ్ దేవరకొండకు జోడీగా సమంత నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube