డ్రగ్స్ అనేది చాలామందికి ఓ వ్యసనంలా మారింది.డ్రగ్స్ తీసుకోకుంటే వారికి ఏదోలా ఉంటుంది.
కొందరు ప్రతిరోజు డ్రగ్స్ తీసుకోకుండా ఉండరు.మరికొందరు తమకు ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు మాత్రమే తీసుకుంటారు.
ఇక మరీ ఒత్తిడికి లోనైతే మాత్రం తీసుకోవలసిన దానికంటే ఎక్కువ డోస్ తీసుకొని లేని ప్రమాదాలు కూడా కొని తెచ్చుకుంటారు.
మామూలుగా డ్రగ్స్ తీసుకోవడమే పెద్ద నేరం.
ఇక దానిని అధిక మొత్తంలో తీసుకుంటే దాని తీవ్రమైన ప్రభావం ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇక ఈ డ్రగ్స్ ను ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు, రాజకీయ నాయకులు, కొందరు ప్రముఖులు వీటిని తీసుకోవడానికి బాగా ఇష్టపడుతుంటారు.
ఎక్కువగా ఇండస్ట్రీకి చెందిన వాళ్లే బయట పడగా చాలామంది జైలుకు కూడా వెళ్లారు.
అలా ఈ వ్యవహారం గురించి ఇప్పుడే కాదు గత కొన్ని ఏళ్ళ నుండి ఇండస్ట్రీలో పాకుతూనే ఉంది.
ఇటీవలే కూడా కొందరు నటీనటులు డ్రగ్స్ కేసులో ఇరికిన సంగతి తెలిసిందే.ఇక ఓ టీవీ యాంకర్ కు కూడా ఈ అలవాటు ఉండటంతో ఎక్కువ మోతాదులో తీసుకొని ఏకంగా ప్రాణాలే కోల్పోయింది.
ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకుందాం.

ప్రముఖ అమెరికా టీవీ యాంకర్ పీచెస్ జెల్డోఫ్. యాంకర్ గానే కాకుండా మోడల్ గా కూడా బాధ్యతలు చేపట్టింది.ఇక ఈమె ప్రముఖ మ్యూజిషియన్, కాంపెనీయినర్ బోబ్ జెల్డోఫ్ రెండో కూతురు.
ఈమె తల్లి పౌలా యేట్స్.ఇక ఈమె కూడా అధికంగా డ్రగ్స్ తీసుకోవడం వల్ల మరణించింది.
ఇక పీచెస్ థామస్ కోహెన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇక ఈమెను తన భర్త తండ్రి అయిన కెయిత్ తను చనిపోయే ముందు రోజు చూశాడు.
ఆ తర్వాత రోజు తన భర్త ఈమెకు ఎంతకు ఫోన్ చేసిన రెస్పాన్స్ లేకపోయేసరికి అనుమానం వచ్చి చూసేసరికి తాను మరణించిందని తెలిసింది.అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆమె శరీరంలో మార్పులు జరిగి మరణించినట్లు తెలిసింది.

తాను చనిపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ విషయం అప్పుడు బయట పడలేదు.కానీ బాగా విచారణ చేయగా తాను చనిపోయిన నెల తర్వాత తాను అధిక మోతాదులో డ్రగ్స్ తీసుకోవడం వల్ల జరిగింది అని బ్రిటన్ పోలీసులు తమ విచారణలో ఈ విషయాన్ని వెల్లడించారు.

ఇక ఇదంతా జరిగింది కొన్ని ఏళ్ళు అవగా ప్రస్తుతం మళ్లీ ఈ వార్త నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఇటీవలే కూడా టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ కేస్ లో దొరకటంతో వారిని ఈడీ అధికారులు విచారణ చేసిన సంగతి తెలిసిందే.ఇంకా ఈ విషయంలో ఇండస్ట్రీ ప్రముఖులపై మరిన్ని అనుమానాలు ఉండటంతో ఈడీ అధికారులు మరో కోణం లో విచారణ చేపడుతూనే ఉన్నారు.