అనసూయకు ఆ పాటలు అచ్చిరావడం లేదా..?

బుల్లితెర కామెడీ షోలలో ఒకటైన జబర్దస్త్ షోకు యాంకర్ గా వ్యవహరించినా, సినిమాల్లో కీలక పాత్రల్లో నటించినా యాంకర్ గా, నటిగా విజయాలను సొంతం చేసుకున్నారు అనసూయ.ఇండస్ట్రీలో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్ల రేంజ్ లో అనసూయ సినిమాల్లోని పాత్రల కోసం పారితోషికం తీసుకుంటున్నారు.

 Anasuya Special Song Movies Become Disasters In Tollywood, Anasuya ,movie Disa-TeluguStop.com

ఒకవైపు సినిమాల్లో మంచి పాత్రల్లో నటిస్తూనే అనసూయ స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తుండటం గమనార్హం.

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల వదులుకున్న అనసూయ నాగార్జున నటించిన సోగ్గాడే చిన్నినాయన సినిమాలో మాత్రం స్పెషల్ సాంగ్ చేసి అనసూయ మెప్పించారు.

అయితే సోగ్గాడే చిన్నినాయన సినిమాలో అనసూయ పూర్తి సాంగ్ లో లేకపోవడం గమనార్హం.ఆ తరువాత సాయిధరమ్ తేజ్ విన్నర్ సినిమాలో అనసూయ సూయ సూయ అనే సాంగ్ చేశారు.

Telugu Anasuya, Disasters, Chavukaburu, Flop, Mahasamudram, Sai Dharam Tej-Movie

సాయిధరమ్ తేజ్ విన్నర్ సినిమా ఫలితం మనందరికీ తెలిసిందే.ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో పాటు సినిమాకు పాట పెద్దగా ప్లస్ కాలేకపోయింది.ఆ సినిమా తరువాత అనసూయ చావుకబురు చల్లగా సినిమాలో పైన పటారం లోన పటారం అనే స్పెషల్ సాంగ్ లొ చేశారు.ఈ పాట కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

కానీ చావు కబురు చల్లగా సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేకపోయింది.

ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు బాగానే వచ్చినా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో సినిమా నిర్మాతలు ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టడంలో ఫెయిల్ అవుతోంది.

అనసూయ స్పెషల్ సాంగ్స్ చేసిన సినిమాలు ఫ్లాప్ అవుతుండటంతో అనసూయకు స్పెషల్ సాంగ్స్ అచ్చిరావడం లేదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు అనసూయకు మహాసముద్రం సినిమాలో స్పెషల్ సాంగ్ చేసే ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube