కామా తురాణం న భయం న లజ్జా అని ఊరికే అనలేదు పెద్దలు.ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్దితులకు అచ్చు గుద్దినట్లుగా సరిపోయింది.
కాగా ఎప్పుడు కామం కోసం ఆలోచిస్తూ, కామం తో కళ్ళు ముసుకు పోయిన వారికి, బయట ఏది కనబడినా దాన్ని కామం తోనే చూడగలరు.ఇలా చివరికి మూగ జీవాలను కూడా వదలడం లేదు.
ఇకపోతే మహారాష్ట్రలోని పుణే లో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది.ఆ వివరాలు చూస్తే.పుణేలోని మోడల్ కాలనీకి చెందిన ఓ రెసిడెన్షియల్ సొసైటీ పార్కింగ్ ఏరియాలో ఓ వృద్ధుడు శునకానిపై దారుణానికి ఒడిగట్డాడట.ఈ కామాంధుడు గతేడాది అక్టోబర్ నుంచి ఓ ఆడ శునకంపై అఘాయిత్యానికి పాల్పడుతున్నాడట.
అయితే ఇతన్ని ఎలాగైన ఆధారాలతో సహా పట్టుకునేందుకు ప్రణాళిక సిద్దం చేసిన ఓ స్వచ్ఛంద సంస్థ ఇందులో భాగంగా ఆ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసిందట.ఈ క్రమంలో పక్కా ఆధారాలతో ఆ శునకంపై లైంగిక దాడికి పాల్పడుతూ వృద్ధుడు పట్టుబడ్డాడని రెస్య్కూ ట్రస్ట్ ఫౌండర్ నెహ పంచమియా తెలిపారు.
ఇక ఈ విషయాన్ని పోలీసులకు తెలపడంతో నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారట.