జగన్ దీక్షతో ఫలితం ఉంటుందా?

ఎపీకి ప్రత్యేక హోదా సాధించడానికి వై కా పా అధినేత జగన్ చేస్తున్న నిరాహార దీక్ష గురువారం రెండో రోజుకు చేరుకుంది.ద్వితీయ విఘ్నం కాకుండా సాగినందుకు మంచిదే.

 Ambati Rambabu Hopes Ys Jagan’s Deeksha Is Fruitful-TeluguStop.com

అయితే ఈ దీక్షతో హోదా వస్తుందా? ఇది సామాన్యులకు కలుగుతున్న సందేహం.ఈ సందేహాన్ని క్లియర్ చేసారు పార్టీ సీనియర్ నేత, జగన్ కుడిభుజం వంటి వాడిన అంబటి రాంబాబు.

జగన్ దీక్ష తప్పకుండా ఫలితం ఇస్తుందని నమ్మకంగా చెప్పారు.అధినేత దీక్షకు ఫలితం ఉండదని చెప్పలేరు కదా.ఈ ఫలితం రావడానికి ఆధారం ఏమిటో చెప్పలేదు.వస్తుందనే నమ్మకం మాత్రమే.

జగన్ పోరాటం చేస్తుండగా ముఖ్యమంత్రి చంద్రబాబు హోదా కోసం తాను పోరాటం చేయబోనని చెప్పారు.కేంద్రంతో పోరాడితే ప్రయోజనం కలగదని, నష్టపోతామని అన్నారు.

కేంద్రంతో మంచిగా ఉంటూ, బతిమిలాడి, బుజ్జగించి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా సంపాదిస్తామన్నారు.ఎన్నాళ్ళు బతిమాలుతారో తెలియదు.

ఒకప్పుడు కేంద్రంలో బాబు చక్రం బాగానే తిరిగింది.కాని ఇప్పుడు ఈయన తిరగాల్సి వస్తున్నది.

తిరిగినా పని కాకపోతే ఏం చేస్తారో మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube