టిఫిన్ సెంటర్ పెట్టిన అల్లు అర్జున్.... మసాలా దోస స్పెషల్ అంట...

తెలుగులో ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు.కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ తెలుగు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పలు పాటలు మరియు టీజర్ విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

 Allu Arjun Rapido Ad Viral In Social Media, Allu Arjun, Rapido, Rapido Bikes, T-TeluguStop.com

అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఒకపక్క సినిమాల్లో మరియు పలు వాణిజ్య సంస్థల ప్రకటనల్లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు.

అయితే తాజాగా అల్లు అర్జున్ రాపిడో సంస్థని ప్రమోట్ చేస్తూ ఓ ప్రకటనలో నటించాడు.ఈ ప్రకటనలో భాగంగా అల్లు అర్జున్ టిఫిన్ సెంటర్ దగ్గర మసాలా దోశలు అమ్ముతూ “అబ్బాయ్ దోశలు తినాలంటే రెండు చోట్ల ఫేమస్ అని ఒకటి ఈ గురు గాడి దగ్గర రెండోది ఆ వీరవాసం బస్సు వెళ్లే చోటని కానీ ఆ బస్సులో వెళితే కారం దోశ మాదిరిగా జనాలు అటూ ఇటూ తిరగేస్తారని అలాంటప్పుడు జనాలతో ఇబ్బందిపడుతూ ప్రయాణించడం కంటే రాపిడో బుక్ చేసుకొని చాలా సులభంగా మరియు హ్యాపీ గా ప్రయాణించవచ్చని చెబుతూ రాపిడో సంస్థల సేవలను ప్రమోట్ చేశాడు.

Telugu Allu Arjun, Alluarjun, Pushpa, Rapido, Tollywood-Movie

దీంతో ఇటీవలే రాపిడో సంస్థ అధికారులు ఈ ప్రకటన వీడియో ని సోషల్ మీడియాలో విడుదల చేశారు.దాంతో ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.అయితే ఈ వీడియో కోసం రాపిడో సంస్థ అధికారులు అల్లు అర్జున్ కి దాదాపుగా లక్షల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం.కాగా ప్రస్తుతం రాపిడో సంస్థ భారతదేశంలో ఉన్నటువంటి పలు ప్రముఖ నగరాలలో తమ సేవలను అందుబాటులోకి తెచ్చింది.

దీంతో ప్రయాణికులు సులభంగా రాపిడో యాప్ ద్వారా ఎక్కడికి వెళ్లాలో గమ్యస్థానాన్ని నమోదు చేస్తే చాలు ప్రయాణికుడు ఉన్నచోటికి రాపిడో కెప్టెన్లు వచ్చి బైక్ మీద తీసుకెళ్లి సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే అల్లు అర్జున్ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

తొందర్లోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది.కాగా ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రం మొదటి భాగం ఈ ఏడాది డిసెంబర్ 17వ తారీఖున విడుదల చేస్తున్నట్లు ఇటీవలే ఈ చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.మరి పుష్పరాజ్ తన అభిమానుల అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube