టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరనే సంగతి తెలిసిందే. నిత్యామీనన్ తెలుగులో నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.
తారక్, బన్నీలకు జోడీగా నటించిన ఈ హీరోయిన్ కు గతంతో పోలిస్తే సినిమా ఆఫర్లు తగ్గినా అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రలకు నిత్యామీనన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.అయితే నిత్యామీనన్ తాజాగా సినిమా రివ్యూలపై ఫైర్ అయ్యారు.
సినిమా రివ్యూల వల్ల కొన్ని సినిమాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా నష్టం కలుగుతున్న నేపథ్యంలో నిత్యామీనన్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.తాజాగా ధనుష్, నిత్య కలిసి నటించిన తిరు మూవీ విడుదల కాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్యామీనన్ నెగిటివ్ రివ్యూలపై విరుచుకుపడ్డారు.
ఈ మధ్య కాలంలో కొందరు ప్రతి సినిమాను ఎక్కువగా విశ్లేషిస్తున్నారని నిత్యామీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇలా తీస్తేనే సినిమాను చూస్తారంటూ వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను ప్రేక్షకులపై రుద్దుతున్నారని నిత్యామీనన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అలా ఉంటే మూవీ బాగుండేదని ఇలా ఉంటే మూవీ బాగుండేదని చెబుతున్నారని నిజంగా అంత టాలెంట్ ఉన్నవాళ్లు సొంతంగా సినిమా తీయొచ్చు కదా అంటూ నిత్యామీనన్ ప్రశ్నించారు.ఒక్కొక్కరూ సినిమాను ఒక్కోలా అర్థం చేసుకుంటారని ఆమె అన్నారు.

కొందరు రివ్యూల పేర్లతో సినిమాలపై నెగిటివ్ అభిప్రాయాలు కలిగేలా చేస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు.రివ్యూ చెప్పినంత సులువుగా సినిమా తీయలేమని ఆమె చెప్పుకొచ్చారు.రివ్యూలు ఇచ్చేవాళ్లపై నిత్యామీనన్ చెప్పిన అభిప్రాయాన్ని కొంతమంది మెచ్చుకుంటుంటే మరి కొందరు విమర్శిస్తున్నారు.సినిమా రివ్యూల వల్ల కొన్ని సినిమాలకు బెనిఫిట్ కలుగుతుంటే మరికొన్ని సినిమాలకు నష్టం కలుగుతోంది.
అయితే మంచి కంటెంట్ తో తెరకెక్కితే నెగిటివ్ రివ్యూలు వచ్చిన సినిమాలు సైతం సక్సెస్ సాధించిన ఘటనలు ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.