హిందీలో దాదాపు 50కి పైగా చిత్రాల్లో ప్రాముఖ్యత ఉన్నటువంటి పాత్రలో నటించిన టువంటి సీనియర్ నటి అనిత రాజ్ ప్రేక్షకులకు బాగానే గుర్తు ఉంటుంది.అయితే ఈమె ప్రస్తుతం ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క పలు సీరియళ్లలో కూడా నటిస్తోంది.
అయితే తాజాగా అనితా రాజ్ కి సంబంధించినటువంటి ఓ వార్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏంటంటే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ప్రజలను సామాజిక దూరం పాటిస్తూ తాము ఉన్నటువంటి నివాసాలకే పరిమితం కావాలని చెబుతున్నప్పటికీ నటి అనితా రాజ్ ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమ సమీప బంధువులకు ఆశ్రయం ఇచ్చిందని అనిత పొరిగింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారట.
దీంతో సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే అనిత రాజ్ నివాసానికి వెళ్లి విచారించగా ఇంటిలో తన సమీప బంధువులు ఉన్నట్లు తెలుసుకున్నారు.
ఈ విషయం గురించి అనిత రాజ్ ను ప్రశ్నించగా ఆమె తన భర్త డాక్టర్ అని మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో తన భర్తను సంప్రదించడానికి తన సమీప బంధువు ఇంటికి వచ్చారని అందువల్లనే వారికి ఆశ్రయం కల్పించానని చెప్పుకొచ్చింది.
దీంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.అంతేగాక నిజానిజాలు తెలుసుకోకుండా తప్పుడు సమాచారాన్ని అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఇరుగు పొరుగువారిని హెచ్చరించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు మహారాష్ట్ర రాష్ట్రంలో నమోదు అయినటువంటి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు గణాంకాలను పరిశీలిస్తే ఇప్పటి వరకు 5,649 కేసులు నమోదు కాగా ఇందులో 789 మంది కరోనా వైరస్ బారినుంచి కో లుకోగా 269 మంది ప్రాణాలను కోల్పోయారు.