నాకు కోపం ఎక్కువని పెళ్లికి ఒప్పుకోలేదు.. శివ బాలాజీ ఆసక్తికర వ్యాఖ్యలు?

ప్రముఖ నటుడిగా, బిజినెస్ మేన్ గా శివ బాలాజీ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.సినిమా రంగంపై ఉండే ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శివ బాలాజీ అశోగ్గాడి లవ్ స్టోరీ మూవీతో ఎంట్రీ ఇచ్చారు.

 Actor Shivabalaji Shocking Comments About His Marriage Problems,latest Tollywood-TeluguStop.com

కొన్ని సినిమాల్లో శివ బాలాజీ సెకండ్ హీరో పాత్రల్లో నటించారు.ఎన్టీఆర్ హోస్ట్ గా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన బిగ్ బాస్ షో సీజన్ 1లో పాల్గొని శివబాలజీ ఆ షో విన్నర్ గా నిలవడం గమనార్హం.

Telugu Corona, Farm, Problems, Shivabalaji-Movie

శివబాలాజీ తన సహనటి అయిన మధుమిత్రను వివాహం చేసుకున్నారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివబాలాజీ, మధుమిత కెరీర్ గురించి, పెళ్లి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.తనకు కోపం ఎక్కువ కావడంతో మధుమిత కుటుంబ సభ్యులు మొదట పెళ్లికి ఒప్పుకోలేదని ఆ తర్వాత అర్థం చేసుకున్నారని శివబాలాజీ చెప్పుకొచ్చారు.పెళ్లికి ముందు శివబాలాజీ, తాను కొన్ని సంవత్సరాల పాటు ప్రేమించుకున్నామని మధుమిత తెలిపారు.

అయితే పెళ్లి జరిగిన తర్వాత తనకు, శివ బాలాజీకి కొన్నిసార్లు గొడవలు జరిగాయని మధుమిత పేర్కొన్నారు.ఆ తర్వాత ఏ విధంగా ఉండాలో తెలుసుకున్నామని మధుమిత వెల్లడించారు.

మధుమిత వంటలు అద్భుతంగా వండుతుందని పప్పుచారు నుంచి పాయా వరకు మధుమిత అన్నీ బాగా చేస్తుందని శివబాలాజీ అన్నారు.అన్న దగ్గరినుంచి ఇంటర్ లో వంటలు నేర్చుకున్నానని మధుమిత తెలిపారు.

Telugu Corona, Farm, Problems, Shivabalaji-Movie

పెళ్లైన తర్వాత సినిమాలు మానేయాలని మధు కుటుంబం డిసైడ్ అయిందని శివబాలాజీ తెలిపారు.అయితే తాను ఆలోచించమని చెప్పానని పెళ్లి తర్వాత మధుమిత పాత్రల విషయంలో పర్టిక్యులర్ అయ్యారని శివబాలాజీ అన్నారు.బాల్యం నుంచి వ్యవసాయం అన్నా నీళ మధ్య ఇల్లు అన్నా ఇష్టమని శివబాలాజీ చెప్పుకొచ్చారు.కరోనా సమయంలో మూడు నెలల పాటు ఫార్మ్ లో గడిపామని మధుమిత, శివబాలాజీ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube