కళాశాల గదిలో బీటెక్ విద్యార్థినికు అబార్షన్.. కాస్త ఆలస్యంగా వెలుగులోకి..!

నెల్లూరు నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాల గదిలో విద్యార్థినికి అబార్షన్( Abortion ) అయ్యి మృతి చెందిన ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మర్రిపాడు మండలానికి చెందిన యువతి (19) నెల్లూరు( Nellore ) నగరంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది.

 Abortion Of A Btech Student In The College Room Abortion , College , Police ,-TeluguStop.com

ఈనెల 11వ తేదీ విద్యార్థులంతా కళాశాల గ్రౌండ్ లో ఉండగా, యువతి ఓ గది లోపలికి వెళ్లి, ఎంతసేపటికి బయటకి రాలేదు.

దీంతో తోటి విద్యార్థులు ఎంతసేపైనా ఆ యువతి బయటకు రాకపోవడంతో గది తలుపులు తెరిచే ప్రయత్నం చేయగా లోపలి నుండి తలుపుకు గడియ పెట్టి ఉండడంతో.

కళాశాల అధ్యాపకులకు విషయం చెప్పడంతో తలుపులు పగలగొట్టి గదిలో పలికి వెళ్లి చూస్తే తీవ్ర రక్తస్రావంతో యువతి అపస్మారక స్థితిలో పడి ఉంది.పక్కనే ఆరు నెలల పిండం చూసి అంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Telugu Latest Telugu, Nellore-Latest News - Telugu

వెంటనే అంతా కలిసి ఆ యువతిని, పిండాన్ని ఆసుపత్రికి తరలించారు.కానీ అప్పటికే ఆ యువతి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళాశాల యజమాన్యం పోలీసులకు( police ) సమాచారం అందించడంతో నెల్లూరు గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి, యువతి తల్లిదండ్రులకు సమాచారం అందించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Telugu Latest Telugu, Nellore-Latest News - Telugu

ఆ యువతి కు మామూలుగానే అబార్షన్ అయ్యిందా.? లేదంటే యూట్యూబ్లో చూసి ఆ యువతి అబార్షన్ చేసుకుందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.యువతి మొబైల్ ఫోన్ ద్వారా దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అనంత సాగరానికి చెందిన కార్ డ్రైవర్ తో సన్నిహిత పరిచయం ఉన్నట్లు బయటపడింది.

పోలిసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి త్వరలోనే అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube