ప్రమాదంలో చిక్కుకున్న గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు కులు మనాలి నుంచి చండీగఢ్ వెళ్తుండగా కొండ చరియలు విరిగిపడి ఘాట్ మధ్యలో ఇరుక్కుపోయిన కార్పొరేటర్లు ఈ నెల 16 నుంచి స్టడీ టూర్ లో ఉన్న విశాఖ నగర పాలక సంస్థ కు చెందిన 95 మంది కార్పొరేటర్లు, కుటుంబ సభ్యులు రాత్రి నుంచి రోడ్ పై బస్ ల లోనే కాలం గడుపుతున్న విశాఖ నగర పాలకులు చేరుకున్న ఆర్మీ సిబ్బంది, వర్షం పడుతుండడంతో తో రోడ్ క్లియర్ చేసేందుకు అనుకూలించని పరిస్థితులు చండీగఢ్ కు 240 కిలోమీటర్ల దూరం లో ఘటన మింద్ ప్రాంతంలో చిక్కుకున్న జి వి ఎం సీ పాలకులు నిన్న కులు మునిసిపాలిటీ లోనే పలు ప్రాంతాలను సందర్శించిన కార్పొరేటర్లు ఇప్పటివరకు ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, సిమ్లా, కులు మనాలి ని దర్శించిన కార్పొరేటర్లు
స్టడీ టూర్ కోసం కులు మనాలి వెళ్లిన విశాఖ కార్పొరేటర్లు ఉత్తరాఖండ్ ఘాట్రోడ్లో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో విశాఖ కార్పొరేటర్లు కొన్ని గంటలపాటు ఇబ్బంది పడ్డారు.విశాఖ నుంచి స్టడీ టూర్ లో భాగంగా కులుమనాలి వెళ్లిన ఈ కార్పొరేటర్లు తిరిగి వస్తుండగా ఘాట్ రోడ్లో రోడ్డు కట్టంగా బండ రాళ్లు పడిపోయాయి కూడా బోల్తా పడింది దీంతో రాత్రి 12 నుంచి ఉదయం వరకు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ నిలిచిపోయింది.
నాలుగు బస్సుల్లో కార్పొరేటర్ల తో పాటు వారి సంబందీకులు ఘాట్రోడ్లో ఉండిపోయారు.ఆహారం అందక ఇబ్బంది పడ్డారు ఈ దశలో విషయం తెలిసిన విశాఖ నగర మేయర్ హరి వెంకట కుమారి ఉత్తరాఖండ్ అధికారులతో మాట్లాడారు ఆర్మీ సిబ్బంది ఉదయం యుద్ధ ప్రాతిపదికన బండరాళ్ళను తొలగించారు.
దీంతో ఉదయం కార్పొరేటర్ల బస్సులు బయలుదేరాయి కొందరు కార్పొరేటర్లు చండీగఢ్ కొందరు కార్పొరేటర్లు ఢిల్లీ వెళ్ళినట్టు తెలుస్తోంది.ప్రమాద స్థలం నుంచి సురక్షితంగా కార్పొరేటర్లు బయటపడడానికి సహకరించిన ఆర్మీ ఉత్తరాఖండ్ అధికారులకు విశాఖ మేయర్ గొలగాని హరి వెంకట కుమారి కృతజ్ఞతలు తెలిపారు.