మీరు తరచూ వాట్సాప్‌ వాడతారా? అయితే ఈ ఎమోజీలకు మీకు అర్థం తెలుసా?

ప్రపంచ సోషల్ మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్ అంటే ఏమిటో తెలియని వారు దాదాపుగా ఉండరనే చెప్పుకోవాలి.ఇది వచ్చిన తరువాత పెను మార్పులు సంభవించాయనే చెప్పుకోవాలి.

 Do You Use Whatsapp Often But Do You Know The Meaning Of These Emojis , Whats-TeluguStop.com

ఓ ఫోన్ నుండి ఓ ఫోన్ కి మొబైల్ అందించే ఓ యాప్ తో ఒకేసారి కేవలం ఒక్కరికే డైరెక్ట్ గా మెసేజ్ పంపించే దానినుండి.వాట్సాప్ అనే యాప్ వలన గ్రూప్స్ లో అనేకమందికి మెసేజెస్ పంపించే స్థాయికి చేరుకున్నాం.

ఇపుడు అదికాస్తా పోయి మాటలనే ఏమోజీ రూపంలో సెండ్ చేసే ట్రెండ్ నడుస్తోంది.సోషల్ మీడియాలో మెసేజ్ లు కంటే ఏమోజీలే ఎక్కువ వినియోగిస్తున్నారు నేటి యువత.

ఉదాహరణకు ఏదైనా రియాక్షన్ ఇవ్వాలంటే ఇంతక ముందు మెసేజ్ రూపంలో ఇచ్చే వాళ్ళు.కానీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక్క ఏమోజీతో తన ఫీలింగ్స్ ని ఫ్రెండ్స్ తో.గర్ల్ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకుంటున్నారు.వాట్సప్ అనే కాదు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఏమోజీలే రాజ్యమేలుతున్నాయని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదేమో.

ప్రేమ, కోపం, బాధ, సంతోషం, దుఖం, నవ్వు, ఏడుపు, ఆకలి ఇలా ఏ ఫీలింగైనా ఒక్క ఏమోజీలో ఇట్టే చెప్పేస్తున్నారు.ఎక్కడ మెసేజ్ టైప్ చేసి టైం వేస్ట్ చేసుకుంటాములే అని కొందరు ఏమోజీలతోనే మాట్లాడేసుకుంటారు.

అయితే మనం తరచూ వినియోగిస్తున్న, లేదంటే వినియోగించని కొన్ని ఏమోజీలకి చాలామందికి అర్ధం తెలియదు.ముఖ్యంగా ప్రేమని వ్యక్తం చేసేందుకు హార్ట్ సింబల్ ఏమోజీలు ఇప్పుడు వాట్సప్ లో చాలా రంగుల్లో కనిపిస్తున్నాయి.

అయితే వాటికి ఉన్న అర్థం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.ఇపుడు వాటిగురించి తెలుసుకుందాం.

Telugu Emojis, Ups, Whatsapp-Latest News - Telugu

రెడ్ హార్ట్ ఏమోజీ’ అనేది ఎక్కువగా ఉపయోగిస్తారు.నిజంగా ప్రేమలో ఉన్న వాళ్ళు దీని సాధారణంగా ఉపయోగిస్తారు.అలాగే ‘బ్లాక్ హార్ట్’ ఎమోజీని యువత విచారకరమైన విషయాలను సూచించేటప్పుడు ఉపయోగిస్తారు.ఇక ‘తెలుపు రంగు హార్ట్ ఏమోజీ’ని ఎవరైనా తమ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు వారి పట్ల సానుభూతి చూపించేందుకు సంకేతంగా చూపిస్తారు.‘బ్లూ కలర్ హార్ట్’ ప్రేమ, ఆనందం, ఉత్సాహాన్ని వ్యక్తపరిచే సమయంలో వాడతారు.ఇక ‘పసుపు కలర్ హార్ట్ ఏమోజీ’ అనేది ఎవరైనా కొత్త వ్యక్తులతో పరిచయం అయినపుడు ఎక్కువగా వాడుతుంటారు… ఇలా రంగుని బట్టి వాటి అర్ధాలు ఉంటాయి.

ఇకనుండి మీరు కూడా అవసరమైనపుడు.సందర్భాన్ని బట్టి వీటిని వినియోగించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube