గత కొన్నాళ్లుగా.అంతే సుమారు కరోనా మహమ్మారి వచ్చిన తరువాత ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశ్రమలు కుదేలైన అసంగతి విదితమే.
అందులో సినిమా పరిశ్రమ ఒకటి.ఇక కరోనా లాక్డౌన్ సమయంలో జనాలు బాగా OTTలకు అలవాటు పడ్డారు.
లాక్డౌన్ అనంతరం కూడా సినిమా ప్రేక్షకులు థియేటర్లో అదే సినిమా బాగుంటేనే వెళ్తున్నారు.లేదంటే లేదు.
ఇక ఈ క్రమంలో మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు… OTT వాళ్ళు ధరలు తగ్గించేస్తున్నారు.దాంతో ఇక మన ఇండియాలో ముఖ్యంగా మన ఇరు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు మూసుకోవలసిందేనా అనే అనుమానం కలగక మానదు.
ఇక అసలు విషయానికొస్తే… ఈమధ్య కాలంలో వివిధ OTT లు ధరల విషయంలో కాస్త వెనక్కి తగ్గిన విషయం విదితమే.ఇకపోతే తాజాగా మరోమారు మరలా వాటి సబ్‌స్క్రిప్షన్ విషయంలో కాస్త ధరలను తగ్గిస్తున్నట్టు భోగట్టా.
OTTలు ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ ఆదాయంపై ఆధారపడటం కంటే ప్రకటనల ద్వారా ఆదాయాన్ని ఆర్జించాలని యోచిస్తున్నాయి.వచ్చే ఏడాది నుంచి నెట్‌ఫ్లీక్స్‌లో ప్రకటనలు మొదలు కానున్నాయి.
అమెజాన్ మినహా ఇతర ఓటీటీ చానల్స్ కూడా ఇదే దారిలో నడబోతున్నట్లు సమాచారం.

అవును… వారు సినిమాలు, షోల మధ్యలో ప్రకటనలు ప్రసారం చేసి భారీ ఆదాయాన్ని ఆర్జించేలా ప్రణాళికలు వేస్తున్నారు.ఇక రేట్లు తగ్గడం వలన మరింత మంది వాటికి ఆకర్షితులు అవుతారు.దాంతో ఇక థియేటర్లు ఇక జనాలు రారా? అనే అనుమానాలు సినిమా విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.కరోనా గడ్డుకాలం తరువాత నత్తనడక సాగుతున్న సినిమా పరిశ్రమలు ఇక ప్రమాదంలో పడినట్టే అని అంటున్నారు.ఓవైపు ప్రేక్షకులకు కావాల్సిన ఎంటర్ టైన్‌ను నట్టింట్లోకి తీసుకొచ్చిన ఓటీటీ సంస్థలన్నీ ఇప్పుడిప్పుడే వాస్తవాన్ని అర్థం చేసుకొని ధరలు మరింత తగ్గించడానికి రెడీ అయిపోయాయని కొంతమంది అంటున్నారు.







