కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఒళ్లు మండింది.ఎందుకు? పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లినందుకు.మమత ప్రధానితో కలిసి వెళితే ఈయనకెందుకు కోపం? ఎందుకు కోపమో రాహుల్ చెప్పారు.”యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మా ప్రధాని (మన్మోహన్ సింగ్) బంగ్లాదేశ్ పర్యటనకు వెళుతూ మమతను కూడా ఆహ్వానించారు.కాని ఆమె అప్పుడు ‘ఏక్లా చలోరే’ (ఒంటరిగా వెళతా) అని సమాధానం ఇచ్చారు.కాని ఇప్పుడు మోదీ అధికారంలో ఉన్నారు.ఏక్లా చలోరే అని చెప్పకుండా ఆయనతో కలిసివెళ్లారు.ఇలా ఎందుకు జరిగింది? ఏమిటీ స్నేహం?” అని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇద్దరూ కలిసి వెళ్లడం వెనక కారణం చెప్పాలని నిలదీశారు.వాస్తవానికి మమత ఎన్డీఏకు దూరంగా లేరు.గతంలో ఆమె ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు.మోదీ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలను ఆకట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకున్న ఆయన బెంగాల్లో మమతకు సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.తమిళనాడులో జయలలితతో కూడా స్నేహానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
అక్రమాస్తుల కేసులో కర్నాటక హైకోర్టు ఆమెను నిర్దోషిగా ప్రకటించగానే ముందుగా అభినందించిన వ్యక్తి మోదీయే.వచ్చే ఎన్నికల నాటికి మరింతమంది మిత్రులను కూడగట్టుకోవాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.
ఇదంతా ఆయన మాయాజాలం.