ఏపీలో పూర్తీ స్థాయి రాజకీయ నాయకుడిలా ఎదిగేందుకు పవన్ కళ్యాణ్ ఎంతో ప్రయత్నిస్తున్నాడు.జనసేన పార్టీని ఇప్పుడు ఉన్న ఆవిధంగా నడిపించాలి అంటే పార్టీకి ఎంతో దమ్ము ఉండాలి.
ప్రజలలో ఎంతో గుర్తింపు ఉండాలి.అయితే ప్రస్తుతానికి జనసేనకి అలాంటి పరిస్థితి లేదు.
మరి ఏ విధంగా పార్టీ ని ముందుకు తీసుకుని వెళ్తారో అని అనుమానం అందరిలో ఉంది.అయితే ఎవరూ ఊహించని విధంగా ఏపీ సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు జయప్రకాశ్ నారాయణ, ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారితో జేఏసీ ఏర్పాటు చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్…జేఏసీ ని ముందుకు తీసుకు వెళ్ళడానికి అడుగులు వేస్తున్నారు…
అయితే అసలు పవన్ కళ్యాణ్ కి జేఏసీ ఏర్పాటు ఆలోచన ఎలా కలిగింది.
ఎందుకు వచ్చింది అసలు దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే విషయాన్ని ఇప్పుడు ఎంతో మంది చర్చించుకుంటున్నారు.అయితే ఈ విషయం గురించి ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ని పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు రాజకీయంగా ఎలా ముందుకు సాగాలని భావిస్తున్నారని పవన్ కేసీఆర్ అడిగారట.దాంతో తానూ అనుకున్న ఆలోచనలని చెప్పాడట పవన్…అనేక చోట్ల సభలు, సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది.
అయితే పవన్ కి కేసీఆర్ ఓ సలగా ఇచ్చాడట.మీరు అనుకున్న విషయాలు అన్ని బాగున్నాయి.అయితే వీటికి తోడు జేఏసీ ఏర్పాటు చేస్తే మీరు అనుకున్న లక్ష్యంకి సరిపోతుంది.తెలంగాణా జేఏసీ చరిత్ర సృష్టించింది అన్న విషయం మీకు తెలిసిందే కదా అని అన్నారట.
మీరు కూడా అదే రకంగా చేయండని పవన్ కు సూచించిన కేసీఆర్…జేఏసీ ద్వారా రాజకీయ ప్రయోజనం కూడా కలుగుతుందని తెలిపారట.అందులో భాగంగా ముందుగానే ఉండవల్లి ,జయప్రకాశ్ నారాయణ లాంటి వారిని అనుకుని కొంత వర్క్ చేసిన తరువాత వారిని సంప్రదించాడట పవన్…అంటే తన రాజకీయ ప్రయాణం కోసం జేఏసీ ఓ మార్గ దర్సినిగా దారి చూపుతుంది అనే భావనకి పవన్ ఫిక్స్ అయ్యాడని తెలుస్తోంది.
మరి పవన్ జేఏసీ తెలంగాణా జేఏసీ లా హిట్ అవుతుందా లేక ఫట్ అవుతుందా అనేది త్వరలో తేలిపోనుంది.