జగన్మోహన్ రెడ్డి పైశాచికపాలనకు, సైకోయిజానికి పరాకాష్ట మూల్పూరి కల్యాణి అరెస్ట్.ఫిబ్రవరి 20 గన్నవరం టీడీపీకార్యాలయంపై వైసీపీగూండాలు దాడిచేసిన ఘటనలో రెండుకేసుల్లో పోలీసులు కల్యాణిని నిందితురాలిగా చేర్చారు.
ఆ ఘటన జరిగిననాడు పోలీసులు, ఆమెను భయభ్రాంతులకు గురిచేశారు.జగన్మోహన్ రెడ్డి వైఫల్యాలు, అతనిప్రభుత్వ అవినీతి, దుర్మార్గాలను ఎత్తిచూపుతున్నందుకే కల్యాణిపై పోలీసులు, వైసీపీ కక్షకట్టింది.
కల్యాణిని నేడు అరెస్ట్ చేసినవిధానం సభ్యసమాజానికే తలవంపులు.ఆమె బట్టలు మార్చుకోవడానికి కూడా వీల్లేకుండా, ఆమెఎలాఉందో అలానే తమతో రమ్మని మహిళాపోలీసులు చెప్పడం నిజంగా మహిళాలోకానికే అవమానకరం.
కల్యాణి ముద్దాయి అయింనతమాత్రాన ఆమెఎలా ఉందో అలానే తీసుకెళ్లమని ఏ చట్టంచెప్పింది? కల్యాణిని బట్టలుకూడా మార్చుకోనీయకుండా పోలీసులు మరీఇంతగా దిగజారిపోయి అధికారపార్టీకి తొత్తులుగా వ్యవహరించాలా? కల్యాణి గంజాయి, డ్రగ్స్ కేసుల్లో నిందితురాలా? లేక ఆమెఏమైనా ఖూనీకోరా? బాబాయ్ ని చంపినవారిని పక్కనపెట్టుకొని ముఖ్యమంత్రి ఢిల్లీపర్యటనలు చేస్తుంటే, ప్రతిపక్షానికి చెందిన మహిళానేతల్ని మాత్రం దేశద్రోహుల్లా పోలీసులు చూడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.కల్యాణిని వెంటనే విడుదలచేయాలని తెలుగుమహిళ విభాగంతరుపున ముఖ్యమంత్రిని పోలీస్ విభాగాన్ని డిమాండ్ చేస్తున్నాం.







