పొగత్రాగడం ఆరోగ్యానికి హానికరం.సినిమాల్లో యాడ్ కనిపిస్తుంది.
ఇది అబద్ధం కాదు.సిగరేట్లో హానికరమైన నికోటిన్ ఉంటుంది.
ఇది కూడా అబద్ధం కాదు.సిగరెట్ల వలన లంగ్ క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వస్తుంది.
అస్సలు అబద్ధం కాదు.సిగరేట్ల వలన శృంగార జీవితంలో స్టామినా తగ్గిపోతుంది.
ఇది ఏమాత్రం అబద్ధం కాదు.సిగరెట్ల వలన ఓ లాభం కూడా ఉంది.
ఇది మాత్రం అబద్ధం అనుకునేరు .ఇది కూడా అబద్ధం కాదు.అలాగని సిగరేట్లు ఆరోగ్యకరం అని చెప్పడం లేదు.
ఇక సిగరెట్ వలన ఉన్న ఒక లాభం ఏంటంటే … ఇది కాలరీల ఇంటేక్ (తీసుకునే శాతం) తగ్గిస్తుంది.ఇది నిజంగా నిజం అని గ్రీస్ పరిశోధకులు చెబుతున్నారు.14 మంది ఆరోగ్యకరమైన మగవారితో ఓ పరిశోధన చేశారు అథేన్స్ లోని హరోకోపియా యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు.వీరందరితో రెండు సిగరెట్లు తాగించారు.
45 నిమిషాల తరువాత వీరిని స్నాక్స్ తినమని చెప్పారు.ఆ సమయంలో వీరి ఆకలిని, తింటున్న విధానాన్ని దగ్గరగా గమనించారు పరిశోధకులు.ఆ తరువాత వారి బ్లడ్ శాంపిల్సు తోసుకోని ఒబెస్టాటిన్, ఘ్రెలిన్, జి ఎల పి 1 లాంటి హార్మోన్స్ లెవెల్స్ పై కన్నేశారు.
వారి పరిశోధనలో తేలిందేమిటంటే .సిగరెట్ ఆకలి పుట్టించే హార్మోన్స్ ని కంట్రోల్ చేస్తోంది.పరిశోధనలో పాల్గొన్న వారు దాదాపుగా 152 కాలరీలు తక్కువ తీసుకున్నారని చెప్పారు అధ్యయనం నిర్వహించినవారు.