హీరో విశ్వక్ సేన్( Vishwak Sen ) నటించిన తాజా చిత్రం లైలా( Laila ).ఈ సినిమా ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవం అని పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అయితే ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. అయితే ఈ సినిమాకు ఇలాంటి నెగిటివిటీ రావడానికి కారణం కమెడియన్ పృథ్వీ రాజ్ ( Pruthvi Raj )చేసిన వ్యాఖ్యలే కారణమని చెప్పాలి.
ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా ఈయన మొదట్లో 150 గొర్రెలు ఉండేవి చివరికి 11 గొర్రెలు మాత్రమే ఉన్నాయి అంటూ పరోక్షంగా పైగా పన్ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేశారు.
ఈ విమర్శలతో ఒక్కసారిగా వైసీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా బాయికాట్ లైలా అంటూ ఈ సినిమాకి పూర్తిస్థాయిలో వ్యతిరేకత చూపించారు అయితే అనుకున్న విధంగానే ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
ఇక ఈ విషయంలో హీరో తప్పు లేకపోయినా కమెడియన్ పృథ్వి జనసేన పార్టీలో కొనసాగుతున్న నేపథ్యంలో ఇలా ఆయన నటించిన ప్రతి ఒక్క సినిమా వేదికపై కూడ ఇలా వైసిపిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ వచ్చారు దీంతో ఒక్కసారిగా వైసిపి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ విషయంలో హీరో విశ్వక్ అలాగే పృథ్వి ఇద్దరు క్షమాపణలు చెప్పిన వైసీపీ అభిమానులు మాత్రం వెనకడుగు వేయలేదు.ఈ క్రమంలోనే మరో కమెడియన్ బ్రహ్మాజీ( Bramhaji ) ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఇంటర్ మీ సందర్భంగా ఈయనకు పృథ్వీరాజ్ విషయం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి.
ఈ ప్రశ్నకు బ్రహ్మాజీ సమాధానం చెబుతూ ఈ విషయంలో పూర్తి తప్పు పృథ్విరాజ్ దేనిని తెలిపారు.వైసిపి వారు కరెక్ట్ గానే ఉన్నారనీ తెలిపారు.

పృథ్వి రాజకీయాలలో ఉండటం తప్పులేదు అయితే ఎన్నికల ప్రచార సమయంలో వారి ప్రత్యర్థి పార్టీని విమర్శించడం తప్పు కాదు కానీ ఇలా ఎన్నికలు అయిపోయి అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు ఒక సినిమా వేదికపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పూర్తిగా తప్పని తెలిపారు.ఈయన వ్యాఖ్యలు కారణంగా హీరో అలాగే నిర్మాతలు ఇబ్బంది పడాల్సి వచ్చిందని తెలిపారు.ఇక హీరో గురించి మాట్లాడుతూ ఆ కుర్రాడు చాలా మంచి వాడనీ తెలిపారు.