సూర్యాపేట జిల్లా:టాటా ఏసీ బోల్తా పడి ఏడుగురికి గాయాలైన సంఘటన అనంతగిరి మండల పరిధిలోని బోజ్జగూడెం తండా గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కోదాడ పట్టణం పరిధిలోని కొమరబండ గ్రామానికి చెందిన ఏడుగురు కూలీలు బొజ్జగూడెం తండా గ్రామంలో సిసి రోడ్డు పనుల నిమిత్తం కూలి పనులకు వెళ్తున్న క్రమంలో టాటా ఏసీ డ్రైవర్ అదుపుతప్పి కింద ఉన్న పంట పొలాల్లో టాటా ఏసీ పల్టి కొట్టడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.
కాగా క్షతగాత్రులను గ్రామస్తులు కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు.