24 గంటలు నాన్‌స్టాప్ డెలివరీ బాయ్‌గా పని చేసిన యూట్యూబర్‌.. చివరికి..??

యూట్యూబర్లు రకరకాల సవాళ్లు టేకప్ చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్నారు.ఇటీవల హర్రీ గల్లెఘర్ ( Harry Gallagher )ఒక యూట్యూబర్ ఎవరు ఊహించని పెద్ద సవాల్ కంప్లీట్ చేశాడు.

 The Youtuber Who Worked As A 24 Hours Non-stop Delivery Boy Finally, Latest News-TeluguStop.com

అందరూ ఆయన్ని “నైట్ స్కేప్” ( Nightscape ) అని పిలుస్తారు.ఈ హర్రీ, లండన్ నగరంలో రోజంతా ఆగకుండా పని చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆయన ఏం చేశాడంటే, లండన్ నగరంలో సైకిల్ మీద, బైక్ మీద తిరుగుతూ, ఆహారం ఆర్డర్లు తీసుకెళ్లి ఇళ్లకు డెలివరీ చేశాడు.అంటే, ఆయన ఒక ఫుడ్ డెలివరీ బాయ్‌లా పనిచేశాడు.ఈ పనిని 24 గంటలు నిద్రపోకుండా చేశాడు.24 గంటలు నాన్‌స్టాప్ డెలివరీ బాయ్‌గా పనిచేయడం అంత సులభమైన పనేం కాదు.

అతను నాన్-స్టాప్ షెడ్యూల్‌లో( non-stop schedule ) ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్ అండ్ డెలివరీ కంపెనీ ఉబర్ఈట్స్‌ ( UberEats ) కోసం పని చేయడం ప్రారంభించాడు.తర్వాత డెలివరూ అనే మరో సర్వీస్‌ను తన దినచర్యకు చేర్చుకున్నాడు.మరిన్ని ఆర్డర్‌లను పొందడానికి, ఛాలెంజ్‌ను మరింత ఉత్తేజపరిచేందుకు అతను ఇలా చేశాడు.ల్యాడ్‌బైబిల్ ప్రకారం, యూట్యూబర్ సోహో అనే ప్రాంతం నుంచి తన పనిని నెమ్మదిగా ప్రారంభించాడు.

తర్వాత మరిన్ని డెలివరీ రిక్వెస్టులు పొందడానికి డాల్స్టన్, టోటెన్‌హామ్ కోర్ట్ రోడ్ వంటి రద్దీగా ఉండే ప్రాంతాలకు వెళ్లాడు.

24 గంటల పాటు ఆగకుండా పనిచేసిన తర్వాత ఆ వీడియోను తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టాడు.ఆ పని ఎంత కష్టమైనప్పటికీ, అతను దాన్ని చాలా ఆసక్తికరంగా భావించానని చెప్పాడు.“నేను నిజంగా చెప్పాలంటే, ఇది చాలా బాగుంది” అని అన్నాడు.“నాకు ఇష్టమైన సైకిల్ తొక్కడం ద్వారా నేను ఆరోగ్యంగా ఉంటాను, కొంత డబ్బు కూడా సంపాదించవచ్చు.ఇది చాలా బాగుంది” అని హ్యారీ అనే ఆ వ్యక్తి అన్నాడు.అయితే, 24 గంటలు నిరంతరం పని చేయడం వల్ల అతను చాలా అలసిపోయాడు.“నేను చాలా సంవత్సరాల్లో ఇంతగా ఎప్పుడూ అలసిపోలేదు” అని అన్నాడు.ఆ పని చేసినందుకు అతనికి మొత్తం 95.93 పౌండ్లు (సుమారు రూ.10,316.52) వచ్చాయి.si=zo7nDflGQVb3iQaa లింక్ పై క్లిక్ చేసి అతడి వీడియోను చూడవచ్చు.

https://youtu.be/DUd9mQ-y5UE?
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube