లండన్ గురించి షాకింగ్ కామెంట్లు చేసిన యూకే మహిళ...

స్వదేశం నుంచి విదేశాలకు వెళ్లడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అందరికీ తెలుసు.కానీ రీసెంట్‌గా ఒక మహిళ ఈ భావన తప్పు అని నిరూపించింది.ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్‌ నగరానికి చెందిన డగ్మారా కెడ్జియర్స్కా( Dagmara Kedzierska ) అనే మహిళ ఇటలీలోని మిలన్ నగరానికి కేవలం 50 పౌండ్లు (సుమారు రూ.5,000) ఖర్చుతో వెళ్లగలిగింది!ఈమె తన అనుభవాలను పంచుకుంటూ, మిలన్‌లో పిజ్జా, అపెరోల్ స్ప్రిట్స్ వంటి లోకల్ ఫుడ్స్ చాలా తక్కువ ధరకే లభించాయని చెప్పింది.ఇంగ్లాండ్‌లో ఒక రోజు బయటకు వెళ్లడానికి ఖర్చు చేసేంత కూడా ఇక్కడ ఖర్చు అవ్వలేదని చెప్పింది.ఇంగ్లాండ్‌లో రైలు టిక్కెట్లు, హోటల్ బిల్లులు చాలా ఎక్కువగా ఉండటంతో, డగ్మారా మిలన్‌ను ఎంచుకుంది.

 Uk Woman Who Made Shocking Comments About London, Budget Travel, London, Nri New-TeluguStop.com

మాంచెస్టర్ నుంచి లండన్ వెళ్లే రైలు టిక్కెట్ ఖర్చు కంటే మిలన్ వెళ్లే ఖర్చు చాలా తక్కువగా ఉంది.

Telugu Budget Travel, Cheap Flights, Day Trips, Europe Travel, London, Cost Trav

ఆమె మిలన్‌కు( Milan ) ఉదయం 10:50 గంటలకు చేరుకుని, కాఫీ, హాట్ క్రోయిసాంట్‌తో తన రోజును ప్రారంభించింది.ఆ తర్వాత, అందమైన కోమో సరస్సును చూడడానికి వారెన్నకు 6 పౌండ్లు (సుమారు 600 రూపాయలు) ఖర్చుతో రైలులో వెళ్లింది.అక్కడ పిజ్జా, అపెరోల్ స్ప్రిట్స్‌లను( Pizza , Aperol Spritz ) తిన్నది.

సరస్సు దగ్గర ప్రశాంతంగా గడిపిన తర్వాత, మళ్ళీ 6 పౌండ్లు ఖర్చుతో రైలులో, 2 పౌండ్లు ఖర్చుతో మెట్రోలో ప్రయాణించి ప్రసిద్ధ డుయోమో కేథడ్రల్‌ను చూడడానికి మిలన్ నగరానికి తిరిగి వచ్చింది.

Telugu Budget Travel, Cheap Flights, Day Trips, Europe Travel, London, Cost Trav

తన పర్యటన ముగించి, మళ్లీ మెట్రోలో స్టేషన్‌కు వెళ్లి, 11 పౌండ్లు ఖర్చుతో మాల్పెన్సా ఎయిర్‌పోర్టుకు రైలులో వెళ్లింది.ఒక రోజు తర్వాత, కెడ్జియర్స్కా రాత్రి 1 గంటకు తన ఇంటికి చేరుకుంది.అంతా కలిపి చాలా తక్కువ ఖర్చుతో ఆమె ఈ ప్రయాణాన్ని పూర్తి చేసింది.

డగ్మారా కెడ్జియర్స్కా బతకడానికి లండన్ చాలా వరస్ట్ ప్రదేశం అన్నట్లు మాట్లాడింది.మిలన్‌కు వెళ్లి వచ్చిన ప్రయాణానికి విమాన టిక్కెట్లు, రవాణా, ఆహారం, పానీయాలు అన్నీ కలిపి 200 పౌండ్ల కంటే తక్కువ ఖర్చు అయ్యింది.

విదేశాలలో వాతావరణం చాలా బాగుంటుందని, ఒక రోజు మాత్రమే వెళ్ళినా సరే, తాను సెలవులో ఉన్నట్లుగా అనిపిస్తుందని చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube