దానిమ్మపండు తినడానికి ఇష్టంగా ఉన్నా, ఆ తోలంతా ఒలిచి తినడం కష్టంగానే ఉంటుంది.అయినా దానిమ్మపండు తినండి.
దానితో వచ్చే లాభాలు అన్ని ఇన్ని కాదు.
* హైబిపి సమస్యలతో బాధపడేవారికి దానిమ్మపండు మేలు చేస్తుంది.
కొలస్ట్రాల్ తో పాటు బిపి తగ్గించడం దీని ప్రత్యేకత.
* గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారు కూడా దానిమ్మను తింటూ ఉండాలి.
దీనిలో ఉండే పోలిఫెనాల్స్ మీ గుండెని సురక్షితంగా ఉంచుతాయి.
* అంగస్తంభన సమస్యను ఎదురుకుంటున్న మగవారు దానిమ్మను ఆశ్రయించాలి.
ఇది టెస్టోస్టిరోన్ లెవెల్స్ ను పెంచి అంగం గట్టిపడటానికి తోడ్పడుతుంది.ఇది వీర్యకణాల ఉత్పత్తిని కూడా పెంచుతుంది.
* విటమిన్ C దానిమ్మలో బాగా లభిస్తుంది.ఇది మీ రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
* బాడికి ఫైబర్ ఎంతో అవసరం.మీరు రోజుకి ఒక్క దానిమ్మ అయినా తినడానికి ప్రయత్నించండి.
అదే రెండు తింటే ఇంకా మంచిది.ఒక్క దానిమ్మ మీ శరీరానికి కావాల్సిన 45% ఫైబర్ ని అందజేస్తుంది.
* జీర్ణశక్తి ని బాగా పెంచే సాధనం ఈ దానిమ్మ.తెలియనివారు సోడాని ఆశ్రయిస్తారు.
దాని బదులు దానిమ్మ తినండి.
* రోజు దానిమ్మ తినే అలవాటు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువ అని పలు అధ్యయనాలు వెల్లడించాయి.
* క్వీన్ మార్గరెట్ యూనివర్సిటీ రిపోర్టు ప్రకారం, దానిమ్మ స్ట్రెస్ ని కూడా పోగొడుతుంది.శారీరకంగా కాని, మానసికంగా కాని అలసిపోతే దానిమ్మ మీకు మంచి నేస్తంగా మారుతుంది.