అండాశయ క్యాన్సర్ అనేది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మహిళలను ప్రభావితం చేసే ప్రాణాంతక వ్యాధిగా మారిపోయింది.ఇది చాలా సాధారణమైన మరియు ప్రమాదకరమైన క్యాన్సర్ అని కచ్చితంగా చెప్పవచ్చు.
మనం వైద్య ప్రపంచంలో ఎంత పురోగతి సాధించిన వ్యాధిని నయం చేయడానికి ప్రయత్నించడం కంటే నివారించడమే ముఖ్యం.చాలామంది మహిళలకు అండాశయ క్యాన్సర్ గురించి తెలియదు.40 సంవత్సరాలు పైబడిన మహిళలలో లేదా రుతుక్రమం ఆగిపోయిన మహిళలలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.చాలా మంది అండాశయ క్యాన్సర్( Ovarian cancer ) అనేది మహిళలను నాశనం చేసే నిశ్శబ్ద మరియు ప్రాణాంతక వ్యాధిగా భావిస్తున్నారు.
కానీ నిజానికి అది ఎంత మాత్రం నిజం కాదు.అండాశయ క్యాన్సర్ కూడా తొలి దశలో కొన్ని లక్షణాలను కనబరుస్తుంది.ఆ లక్షణాలను గమనించి వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్ష చేసి చికిత్స చేస్తే ఈ క్యాన్సర్ ను దూరం చేసుకోవచ్చు.స్త్రీలను ప్రభావితం చేసే అండాశయ క్యాన్సర్ యొక్క మొదటి లక్షణాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
బహిష్టు సమయంలో కొంతమంది మహిళలు కొన్ని ఆహారాలు తిన్న తర్వాత గుండెల్లో మంటను అనుభవిస్తూ ఉంటారు.కానీ ఒక మహిళ చాలా కాలం పాటు కడుపు నొప్పి( Abdominal pain ) అనుభవిస్తే ఆ మహిళల కు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.ఇంకా చెప్పాలంటే తరచూగా మూత్ర విసర్జన చేయడం అనేక ఆరోగ్య సమస్యల లక్షణం.కాబట్టి చాలామంది మహిళలు ఈ లక్షణాలను అసలు లైట్ గా తీసుకోకూడదు.
చాలామంది మహిళలు( Women ) విస్మరించే మరో ముఖ్యమైన అండాశయ క్యాన్సర్ లక్షణం వెన్నునొప్పి.ఒక మహిళ స్పష్టమైన కారణం లేకుండా వెన్నునొప్పి అనుభవిస్తే అది అండాశయ క్యాన్సర్ కి సంకేతం అని చెప్పవచ్చు.ఈ సందర్భంలో ఖచ్చితంగా వైద్యుల దగ్గరికి వెళ్లడం మంచిది.మహిళలు ఆకలి లేకపోవడం అజీర్ణం, వికారం లేదా వాంతులు వంటి లక్షణాలు కూడా ఉంటాయి.కాబట్టి మీరు అకస్మాత్తుగా ఇలాంటి లక్షణాలు ఉంటే కూడా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.