మాంగళ్య ధారణ చేసినప్పుడు మూడు ముళ్ళు ఎందుకు వేస్తారు?

మన హిందూ సంప్రదాయంలో మాంగళ్య ధారణ అనేది ముఖ్యమైన ఘట్టం.మాంగల్యం అంటే మంచి అని, ధారణ అంటే ధరించటం అని అర్ధం.

 Importance Of Mangalya Dharana Details, Mangalya Dharana, Three Knots, Bride , G-TeluguStop.com

పెళ్ళిలో ఒక మాంగల్యాన్ని పెళ్లికూతురు తరుపు వారు, మరొక దానిని పెళ్ళికొడుకు తరుపు వారు తెచ్చిన రెండు మాంగల్యాలను కలిపి పెళ్ళికొడుకు పెళ్లికూతురి మెడలో కడతాడు.ఈ మాంగల్యానికి అర్ధం రక్షణ, నమ్మకం, మనస్సాక్షికి ప్రతిరూపంగా, జీవితాంతం తోడు నీడగా ఉంటానని పెళ్ళికొడుకు పెళ్ళికూతురికి భరోసా ఇస్తున్నట్టు అర్ధం.

అయితే ఈ మూడు ముళ్ళ వెనక ఒక పరమార్ధం ఉంది.దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రాచీన కాలం నుండి మూడుకి ఒక ప్రత్యేక స్థానం ఉంది.సృష్టి పరంగా చూస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు.

సృష్టి, స్థితి, లయలు మూడు.ప్రతీ వ్యక్తికీ స్థూల, సూక్ష్మ, కారణ అనే మూడు శరీరాలు.స్థూల శరీరం అంటే మాంసం, రక్తం, ఎముకలు.సూక్ష్మ శరీరం అంటే శరీరానికి ఆధార భూతుడైన జీవుడు నివసించేది.

జీవుడు అనుభవించవలసిన సుఖ దుఖా:లని అనుభవిస్తున్నాడా? లేదా? అని సాక్షి భూతంగా పరమాత్మ చూసే శరీరం.ఇలా మూడు శరీరాలకు మూడు ముళ్ళు వేస్తాడు వరుడు వధువుకి.

మాంగళ్య ధారణ చేసినప్పుడు మూడు ముళ్ళు వేయటంలో ఉన్న పరమార్ధం ఇదే.

Importance Of Mangalya Dharana Details, Mangalya Dharana, Three Knots, Bride , Groom, Marriage, Wedding, Taali Bottu, Wife And Husband, Hindu Rituals, Tradition - Telugu Groom, Hindu Rituals, Taali Bottu, Knots #Shorts

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube